Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న తెలుగుతో పాటు హిందీలోనూ థియేటర్లలో విడుదల కానుంది. కాగా తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టికెట్ బుక్ మై షో ద్వారా అమ్మకూడదని నైజాం ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. టికెట్ ధరపై BMS అదనంగా విధించే సర్వీస్, హ్యాండ్లింగ్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ ఛార్జీల నుంచి ప్రతి టికెట్ పై రూ.10ని థియేటర్ యాజమాన్యాలకు బుక్ మై షో చెల్లిస్తోంది. దీన్ని రూ.15కు పెంచాలనే డిమాండుతోనే ఈ సంస్థకు బుకింగ్ అనుమతి ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read: ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి
మరోపక్క ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. మొత్తానికి సినిమాని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కేవలం 2 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారట. అవసరం అనుకుంటే మరో పది నిమిషాల సినిమాను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. ఎందుకంటే.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే త్రివిక్రమే. ఎంతైనా మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కు ప్లే మీద, మాటల మీద మంచి పట్టు ఉంది.
కాగా అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళీ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా పవన్ నుంచి వస్తున్న క్రేజీ మూవీస్ లో ఇది కూడా ఒకటి.
Also Read: రష్మిక ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 25ఏండ్లకే అన్ని కోట్లు వెనకేసింది..!