https://oktelugu.com/

Storage: మొబైల్ స్టోరేజ్ నిండిపోతుందా? ఈ చిన్న ట్రిక్‌తో క్లియర్ చేసేయండిలా!

ఫొటోలు, వీడియోలు తీయడం, సినిమాలు డౌన్‌లోడ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు మొబైల్ స్టోరేజ్ నిండిపోతుంది. స్టోరేజీ నిండిపోయిందని ఇలా బాధపడటం కంటే కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2024 / 10:24 PM IST

    storage

    Follow us on

    Storage: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. అసలు మొబైల్ ఫోన్ లేకపోతే వారికి రోజు కూడా గడవదు. ఎప్పుడూ ఏదో ఒకటి మొబైల్‌లో వాడుతూనే ఉంటారు. బయటకు వెళ్లిన, వెళ్లకపోయిన కూడా ఫొటోలు, వీడియోలు తీయడం, సినిమాలు డౌన్‌లోడ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు మొబైల్ స్టోరేజ్ నిండిపోతుంది. సాధారణంగా చాలా మంది అన్ని సోషల్ మీడియా అకౌంట్లు వాడుతుంటారు. ఇలా వాడేటప్పుడు అన్నింట్లో కూడా ఆటోమేటిక్ డౌన్‌లోడ్ పెట్టుకుంటారు. దీనివల్ల అన్ని డౌన్‌లోడ్ అయి కూడా స్టోరేజ్ నిండిపోతుంది. అయితే ఇలా స్టోరేజ్ నిండిపోతే మళ్లి ఫొటోలు డౌన్‌లోడ్ చేయడానికి కుదరదు. దీంతో తెలియకుండా ఒక్కసారిగా కొన్ని యాప్‌లు డిలేట్ చేస్తారు. కొందరు అన్ని ఫొటోలు, వీడియోలను కూడా డిలీట్ చేస్తారు. దీనివల్ల కొన్ని తీపి గుర్తులు అన్ని కూడా పోతాయి. ఆ తర్వాత అనవసరంగా ఫొటోలు పోయాయని బాధపడుతుంటారు. స్టోరేజీ నిండిపోయిందని ఇలా బాధపడటం కంటే కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

     

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ వాడుతుంటారు. ఇందులో పర్సనల్‌ చాట్స్ ఉండటంతో పాటు గ్రూప్‌లు కూడా ఉంటాయి. ఈ గ్రూప్‌ల్లో రోజూ ఏదో స్టిక్కర్స్, ఫొటోలు, వీడియోలు, జీఐఎఫ్‌ ఫైల్స్ వస్తూనే ఉంటాయి. ఇవి మీకు నచ్చితే డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కాకుండా.. ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను చాలా మంది పెట్టుకుంటారు. దీనివల్ల తొందరగా స్టోరేజీ నిండిపోతుంది. కాబట్టి సెట్టింగ్స్‌లోకి వెళ్లి వీటిని ఆటోమేటిక్ డౌన్‌లోడ్ కాకుండా నచ్చితే డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. దీనివల్ల అసలు స్టోరేజ్ నిండిపోదు. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేసుకోవాలంటే వాట్సాప్‌లో సెట్టింగ్‌లోకి వెళ్లి స్టోరేజ్ డేటా ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆటోడౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి.

     

    ఇలా చేయడం వల్ల ఏదైనా ఫొటో, వీడియో, ఫైల్ ఏదైనా కూడా మీరు డౌన్‌లోడ్ చేస్తేనే అవుతుంది. లేకపోతే డౌన్‌లోడ్ కాదు. అలాగే మొబైల్‌లో ఫొటోలు, వీడియోలు ఎక్కువ స్టోరేజ్‌ను ఆక్రమిస్తాయి. డైరెక్ట్‌గా వీటిని మొబైల్‌ స్టోరేజ్‌లోకి డౌన్‌లోడ్ చేయకుండా క్లౌడ్ స్టోరేజ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి. సాధారణంగా ఫోన్లలో 256 జీబి వరకు స్టోరేజ్ ఉంటుంది. తెలియకుండానే కొన్నిసార్లు ఈ స్టోరేజ్ మొత్తం నిండిపోతుంది. దీనివల్ల మొబైల్ కూడా కొన్నిసార్లు స్లో అవుతుంది. కాబట్టి ఈ చిన్న ట్రిక్‌ను పాటిస్తే స్టోరేజ్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే మొబైల్‌ స్టోరేజ్‌లో అప్పుడప్పుడు మనకి అవసరం లేని యాప్‌లలో క్లియర్ కాచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అందులో కొంత స్టోరేజ్ క్లియర్ అవుతుంది. మనకి తెలియకుండా కొన్నింటిని డౌన్‌లోడ్ చేయడం వల్ల స్టోరేజ్ నిండిపోతుంది. అదే అప్పుడప్పుడు క్లియర్ కాచ్ చేయడం వల్ల క్లియర్ అవుతుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా వర్క్ అవుతుంది.