Health Alert: చిన్న పిల్లలు సాధారణంగా పిప్పరమెంట్లు, చాక్లెట్స్, జెమ్స్ వంటివి తింటూ ఉంటారు. ఆ వయస్సులో ఎవరైనా వాటికి ఆకర్షితులు అవుతారు, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే కొన్నిటిని కచ్చితంగా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. వాటి వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే ప్రమాదం ఉంటుంది. అలా దూరం పెట్టాల్సిన వాటిల్లో మొదటిది జెమ్స్. మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా వీటిని తింటుంటే వాళ్ళ చేత వెంటనే ఆ అలవాటుని మానిపించండి. ఇందులో వాడే పదార్థాలు చాలా డేంజర్. జెమ్స్ ప్యాకెట్ వెనుక మనకి ఎలాంటి పదార్దాలు వాడారు, ఏ కెమికల్స్ ఉపయోగించారు అనేవి పూర్తి వివరాలతో అందిస్తారు. ఇందులో ఎమెల్సీఫైర్స్(414 ,442, 476) అనే కెమికల్ చాలా డేంజర్.
ఎలాంటి కలర్స్ ఉపయోగించారు అనేది కూడా అందులో వివరంగా ఉంటుంది. కలర్స్ ని నంబర్స్ ఫార్మటు లో పెడుతారు. 171,102, 133 , 124,127,122,132 ,110 అని ఉంటుంది. వీటిల్లో 171 అనగా తెలుపు రంగు. తెలుపు కలర్ పేరు టైటానియం డయాక్సైడ్. ఈ కెమికల్ ని యూరోపియన్ కంట్రీ లో బ్యాన్ చేసారు. ఈ తెలుగు ఎంత ప్రమాదకరమంటే, మన శరీరం లోని DNA ని పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే ఇది ఇతర దేశాలలో బ్యాన్ చేయబడింది. అలాగే 102 అనగా పసుపు రంగు. దీనిని టెట్రాజైన్ అని పిలుస్తారు , ఈ కెమికల్ ని నార్వే దేశం బ్యాన్ చేసి చాలా కాలమే అయ్యింది. ఈ కెమికల్ కారణంగా మనకి ఆస్తమా వంటి సమస్యలు వస్తుంటాయి. 133 అనగా నీలి రంగు, దీనిని జర్మనీ వాళ్ళు బ్యాన్ చేసారు.
ఈ కెమికల్ ని ఉపయోగించడం వల్ల దురద వంటి సమస్యలు వస్తాయి. అలాగే 124 ,127 , 122 నంబర్లు ఎరుపు రంగుని సూచిస్తాయి. వీటిని అమెరికా లో బ్యాన్ చేసారు. ఇలా ఇన్ని దేశాల్లో బ్యాన్ చేసిన ఈ కెమికల్స్ ని మన భారతదేశం లో మాత్రం బ్యాన్ చేయలేదు. వాటి అన్నిటిని కలిపి మనం తినేస్తాము, ఇక మన శరీరం లో ఎన్ని రోగాలకు భీజం పడుతుందో మీరే ఆలోచించండి. 5 లేదా 10 రూపాయలకు అందుబాటులోకి వచ్చేస్తుంది, చాలా రుచికరంగా ఉన్నాయని ఇష్టమొచ్చినట్టు పిల్లల చేత తినిపిస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని మీ చేతులారా చెడగొట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది గమనించగలరు. పిల్లలకు అసలు బయట ఆహారాలను అలవాటు చేయడం మెల్లిగా తగ్గించండి. ఎందుకంటే ప్రతీ పదార్థాన్ని తయారు చేయడానికి ఎదో ఒక కెమికల్ ని ఉపయోగిస్తారు. అవి శరీరంలోకి వెళ్లిన తర్వాత లేనిపోని రోగాలు వస్తుంటాయి. అసలు ప్రస్తుత కాలం లో కొత్త కొత్త ప్రాణాంతక వ్యాధులు పురుడుపోసుకుంటున్నాయి,ఇలాంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలకు ఇమ్మ్యూనిటి పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ వార్త ని సాధ్యమైత వరకు షేర్ చేసి అందరికీ అవగాహన కల్పించండి.