Mistakes while drinking coconut water: కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. నీరసం, అలసటగా అనిపించిన వెంటనే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా కుదుటపడుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. కొబ్బరి నీరు డైలీ తాగడం వల్ల బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే కొబ్బరి నీరు జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా కొబ్బరి నీరును ఉదయం పరగడుపున తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో కొబ్బరి నీరుకి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే చాలా మందికి తెలియక కొబ్బరి నీరు తాగేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల ఆరోగ్యమైన కొబ్బరి నీరు కూడా చివరికి అనారోగ్యం అయిపోతాయి. మరి తెలియకుండా చేసే ఆ చిన్న తప్పులు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
సాధారణంగా కొబ్బరి నీరు మార్కెట్లో ఎక్కువగానే దొరుకుతాయి. కొందరు కాయలను కొట్టించి ఇంటికి తీసుకొచ్చి గ్లాసులో వేసి తాగుతారు. కొందరు బాటిల్‌లో తెచ్చుకుంటారు. అయితే ఎక్కువ శాతం మంది కొబ్బరి నీరును అక్కడే స్ట్రా వేసి తాగుతుంటారు. ఇలా కొబ్బరి బొండాంలో స్ట్రా పెట్టి నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లను ఎప్పుడూ కూడా గ్లాసులో వడపోసిన తర్వాతే తాగాలి. ఎందుకంటే కొబ్బరి లోపల ఫంగస్ వంటి బ్యాక్టీరియాలు ఉండవచ్చు. అదే గ్లాసులో వడపోసుకుని తాగితే నీటిలో ఏదైనా ఫంగస్ ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుంది. డైరెక్ట్ స్ట్రా ద్వారా తాగితే అందులోని ఫంగస్ లోపలికి వెళ్లిపోతుంది. దీంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొబ్బరి నీటిని డైరెక్ట్ తాగవద్దు. కొందరు కొబ్బరి నీటిని బాటిల్‌తో తీసుకొచ్చి.. ఫ్రిడ్జ్‌లో ఉంచి తాగుతారు. ఇలా తాగడం అంత మంచిది కాదు. కొబ్బరి కాయ నుంచి నీళ్లు వేరు చేసిన ఒక అరగంట లోగా తాగేయాలి. లేకపోతే నీరు పుల్లగా, రుచి మారిపోతాయి.
డైలీ లైఫ్‌లో కొబ్బరి నీటిని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి కావాల్సిన బలం చేకూరుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని మెరిపించడంలో బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కొబ్బరి నీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. డైలీ కొబ్బరి నీరు తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తి కూడా వస్తుంది. బాడీ బాగా వేడిగా మారితే కొబ్బరి నీరు చలువ చేస్తుంది. ఈ నీరు తాగడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. ఉదయం పూట తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.