Wearing Sandals : ఎక్కువ కాలం అవే చెప్పులు వాడుతున్నారా? ఈ విషయం మీ కోసమే?

చెప్పులైనా, షూలైనా, సాక్సైనా, 6 నెలల తర్వాత ఒక్క రోజు కూడా ఎక్కువగా వాడకూడదంట. కుదిరితే ముందే మార్చుకోవడం బెటర్. కానీ ఆరు నెలల తర్వాత వాడవద్దు అంటున్నారు. ఆ తర్వాత కూడా వాడుతూ ఉంటే, అనారోగ్య సమస్యలు వస్తాయట. ఎక్కువగా వాడిన చెప్పులను వాడటం వల్ల అనారోగ్యాలు వస్తుంటాయట.

Written By: Swathi, Updated On : August 20, 2024 6:45 pm

Wearing Sandals

Follow us on

Wearing Sandals ఇప్పుడు రకరకాల చెప్పులు అందుబాటులోకి వచ్చాయి. కానీ పూర్వం మాత్రం కేవలం చెక్కతో చేసినవి వాడేవారు. అవి కూడా చెప్పుల లాగానే ఉంటూ కంఫర్ట్ గా ఉండేవి. ఎన్ని రకాలు, ఎంత డిజైన్ లు ఎంత ఖరీదు అయినా సరే చెప్పుల్ని ఇళ్ల బయటనే వదులుతారు. ఎందుకంటే బయట దరిద్రం ఇళ్లలోకి రాకూడదని నమ్ముతారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. అయితే ఇంట్లో వాడుతున్న చెప్పులను మాత్రం అసలు బయట వాడరు. కానీ కాలం మారింది కద బాస్.

చెప్పులు, షూలు, ఆఫ్ షూలు, హీల్స్ ఇలా వచ్చిన రకాలు కాళ్ల అందాన్ని పెంచుతున్నాయి. వాటిలో కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ రకాలున్నాయి కదా. పార్టీని, ఫంక్షన్ ను బట్టి కూడా చెప్పులు వేసుకునే విధంగా డిజైన్ చేస్తున్నారు. కొందరు ఏకంగా షాపింగ్‌కి వెళ్లి షూస్ కొనుక్కొని, వాటికి మాచ్ అయ్యేలా డ్రెస్ కొనుక్కుంటారు. లేదంటే డ్రెస్ కు మ్యాచ్ అయ్యే షూలు, చెప్పులు కొన్కుంటారు. ఇలా ఎక్కువ జతలే ఉంటాయి కూడా. ఐతే షూస్, చెప్పులకి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందంటే మీరు నమ్ముతారా? మరీ ముఖ్యంగా చెప్పులు ఎన్ని రోజులు వాడాలో మీకు తెలుసా? అయితే ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

అమ్మాయిలు ఏడాదిలో ఎన్నో రకాల చెప్పులు వాడుతుంటారు. అబ్బాయిలు మాత్రం సంవత్సరంలో ఒకటి లేదా 2 జతలే ఉపయోగిస్తారు. కారణం వారికి చెప్పుల ఫ్యాషన్‌పై పెద్దగా ఆసక్తి ఉండదు ఉన్నా ఇంట్రెస్ట్ ఉండదు అంటారు. అందరూ అబ్బాయిలు ఇలా ఉండరు. అమ్మాయిలు కూడా ఎక్కువగా చెప్పుల ఫ్యాషన్ గురించి తెలిసిన వారు ఉండరు. ఉన్న పెద్దగా పట్టించుకోరు. కానీ అబ్బాయిలతో పోలిస్తే కాస్త అమ్మాయిలకు ఎక్కువ తెలుసనే చెప్పాలి. చెప్పులు నచ్చితే, వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటూ, ఎంతకాలమైనా వాడుతారు ఎవరైనా. కానీ ఈ అలవాటు కరెక్ట్ కాదట. చెప్పులు, షూలను గడువు ముగిశాక వాడటం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

చెప్పులైనా, షూలైనా, సాక్సైనా, 6 నెలల తర్వాత ఒక్క రోజు కూడా ఎక్కువగా వాడకూడదంట. కుదిరితే ముందే మార్చుకోవడం బెటర్. కానీ ఆరు నెలల తర్వాత వాడవద్దు అంటున్నారు. ఆ తర్వాత కూడా వాడుతూ ఉంటే, అనారోగ్య సమస్యలు వస్తాయట. ఎక్కువగా వాడిన చెప్పులను వాడటం వల్ల అనారోగ్యాలు వస్తుంటాయట. చెప్పులు, షూలు, సాక్సుల్లో ఫంగస్ వంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు ఉంటాయి. ఇవి కాలం గడిచే కొద్దీ అవి వృద్ధి చెందుతుంటాయి.

అయితే బ్యాక్టీరియా సమస్య ఉన్నట్టు మీకు మొదటగా తెలియకపోయినా.. కొంతకాలం తర్వాత అవి కాలి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి. ఆ తర్వాత కాళ్లకు రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయట. కాళ్ల మడమలు పగిలిన వారికి మరింత ప్రమాదకరమట. అందుకే ఎక్కువ కాలం చెప్పులను వాడకూడదు.కేవలం 6 నెలల వరకు మాత్రమే వాడటం మంచిది. ఇక పాత చెప్పులను మాత్రం అసలు ఇంట్లో ఉంచొద్దని సూచిస్తున్నారు. తద్వారా అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు రావని సలహా ఇస్తున్నారు నిపుణులు.