Chanakya Neeti : చాణక్య నీతి: ఈ 5 సూత్రాలు పాటిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు..

అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు మార్గం ఎంచుకోకుండా సరైన మార్గంలో పయనించే విధంగా ముందుకు వెళ్లాలి. అప్పుడే మనిషికి విలువ పెరుగుతుంది.

Written By: NARESH, Updated On : August 20, 2024 6:41 pm

Chanakya Neeti success

Follow us on

Chanakya Neeti : చాణక్య నీతి సూత్రాలను పాటించిన కొందరు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. పూర్వకాలంలోనే చాణక్యుడు రాజనీతి బోధనలతో పాటు జీవితానికి సంబంధించిన కొన్ని సూత్రాలు చెప్పారు. ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలో? ఏం చేయకూడదో చాణక్యుడు వివరించాడు. శత్రువలు పట్ల ఎలా ఉండాలో? మిత్రులతో ఎలా కలిసి ఉండాలో వివరించారు. అయితే జీవితం అన్నాక కష్ట, సుఖాలు ఉంటాయి. సంతోషాన్ని ఎవరైనా స్వీకరిస్తారు. కానీ కష్టాన్ని ఓర్చుకోని వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారే జీవితంలో ఫెయిల్ అవుతారని చాణక్యుడి సూచన. అయితే ఆయన చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో గెలవాలంటే ఈ 5 సూత్రాలను పాటించాలని చెప్పారు. ఆ 5 సూత్రాలు ఏంటంటే?

రహస్యం:
ఒక వ్యక్తికి కమ్యూనికేషన్ ఉండాలంటే ఇతరులతో కలివిడిగా ఉండాలి. కొత్త కొత్త స్నేహం చేస్తూ దూసుకుపోవాలి. అయితే కొన్ని జీవితాలకు సంబందించిన రహస్యాలను ఇతరులకు చెప్పొద్దు. ఉదాహరణకు ఒక వ్యాపారాన్ని ఒక చోట ప్రారంభిస్తున్నామనే రహస్యాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా అక్కడ పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తన వ్యాపారా అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు వేశారో కూడా సీక్రెట్ గా ఉంచాలని అంటున్నారు.

కష్టాల సమయంలో..:
ప్రతి ఒక్కరీ జీవితంలో కష్టాలు ఉంటాయి. నేటి కాలంలో అయితే చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతున్నారు. ఇలా చేయడం వల్ల వారు ఎలాంటి పనులు చేయలేరు. ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే భావన ఉండాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మీ ధైర్యాన్ని చూసి పోటీ నుంచి తప్పుకోగలుగుతాడు. అందువల్ల కష్టాల సమయంలో కుంగిపోకుండా ఏదో ఒక దారి కోసం వెతకాలి.

గుణపాఠం:
తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు. అయితే ఆ తప్పున కప్పిపుచ్చకుండా దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మరోసారి ఆ తప్పు జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలి. అప్పుడే మరోసారి తప్పులు చేయకుండా ఉంటారు. దీంతో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఇతరులు తప్పు చేసినా వారిని సరైన మార్గంలో నడిపించగలుగుతారు.

సమాజంలో గుర్తింపు:
ఒక వ్యక్తికి సమాజంలో గుర్తింపు ఉండాలి. అప్పుడే ఎటువంటి పని అయినా చేయడానికి ముందుకు వస్తారు. కేవలం డబ్బు ప్రధానమే చూడకుండా కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి. అప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపుతో కొత్త అవకాశాలు పుడుతాయి. వ్యాపారులు అయితే అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతారు.

తప్పుడు మార్గం వద్దు:
జీవితంలో ఎదగడానికి ఎన్నో దారులు ఉంటాయి. సరైన మార్గం తాత్కాలికంగా కష్టమే ఉంటుంది. కానీ చివరి దశలో గెలుపుకు అవకాశం ఉంటుంది. అతే తప్పుడు మార్గం తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది. కానీ చివరి దశలో తీవ్ర ఆవేదనకు గురవుతారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు మార్గం ఎంచుకోకుండా సరైన మార్గంలో పయనించే విధంగా ముందుకు వెళ్లాలి. అప్పుడే మనిషికి విలువ పెరుగుతుంది.