https://oktelugu.com/

Ghee :  మీరు నెయ్యి వాడుతున్నారా.. అది స్వచ్ఛమైనదో? కాదో? ఇలా తెలుసుకోండి..

తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీదని.. జంతువుల వ్యర్ధాల నుంచి రూపొందించిన ద్రవాలతో నెయ్యి తయారు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నెయ్యిలో కల్తిని ఎలా గుర్తించాలంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 21, 2024 / 09:16 PM IST

    Ghee

    Follow us on

    Ghee :  రోజుకు రెండు లేదా మూడు చెంచాలన్నయ్య పడితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులకు నెయ్యి మంచిదని చెబుతుంటారు. నెయ్యి ఉపయోగించి వండిన అన్నం పిల్లలకు మేలు చేస్తుందని వివరిస్తుంటారు. నెయ్యిలో పోషకాలు విశేషంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రుచి లభిస్తుంది. ఆరోగ్య ప్రయోజనం సిద్ధిస్తుంది. పూర్వకాలంలో మన పెద్దలు ఇంట్లో గేదెలు, ఆవుల పాల నుంచి మీగడ వేరుచేసి వెన్న తయారు చేసేవారు. దానిని వేడి చేసి నెయ్యిగా మార్చేవారు. ఈ ప్రక్రియను శుచి గా చేసేవారు. దీంతో నెయ్యి అత్యంత స్వచ్ఛంగా ఉండేది. కాలానుగుణంగా ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాయి. అప్పటి సంఖ్యలో గేదెలు లేవు. ఆవులు కూడా లేవు. డిమాండ్ పెరగడంతో నెయ్యి లో కల్తీ కావడం మొదలైంది. ఇటీవల కాలంలో అది తారాస్థాయికి చేరింది. వాస్తవానికి నెయ్యితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలున్న నెయ్యి స్వచ్ఛమైనదో? కాదో? తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు చేయాలి..

    నీళ్లతో పరీక్షించాలి

    మనం ఉపయోగించే నెయ్యిలో ఒక చెంచా పరిమాణం గ్లాసు నీటిలో వేయాలి. ఆ నెయ్యి నీటిలో చేరితే అది స్వచ్ఛమైనదని భావించాలి. ఒకవేళ అడుగు ప్రాంతానికి చేరితే అది కల్తీ అని గుర్తించాలి..

    వేడి చేసినప్పుడు

    చిన్న పాత్రలో రెండు లేదా మూడు స్పూన్ ల పరిమాణంలో నెయ్యి వేసి కొంతసేపు వేడి చేయాలి. అనంతరం దానిని రోజు మొత్తం అలానే ఉంచాలి. తర్వాతి రోజు అది చిన్న చిన్న రేణువుల లాగా మారి, దాని నుంచి సువాసనలు వస్తుంటే స్వచ్ఛమైనదని భావించాలి. ముద్దగా ఉంటే కల్తీదని నిర్ధారించాలి.

    ఉప్పును ఉపయోగించి..

    రెండు చెంచాల పరిమాణం గల నెయ్యిలో అర స్పూన్ ఉప్పు వేయాలి. ఆ తర్వాత కొంత పరిమాణంలో ఉప్పు వేసి పక్కన పెట్టాలి. 20 నిమిషాల అనంతరం చూస్తే ఒకవేళ రంగు మారితే అది కల్తీ నెయ్యి అని గుర్తించాలి.

    కొంచెం నెయ్యిని అరచేతిలో వేసుకొని చూడాలి. అది కాసేపటికి కరిగిపోతే నాణ్యమైనదని గుర్తించాలి..

    చెంచా పరిమాణంలో నెయ్యిని ఓ పాత్రలో వేసి వేడి చేయాలి. అది వెంటనే కరిగిపోయి ముదురు చాక్లెట్ రంగు లోకి వస్తే స్వచ్ఛమైనదని భావించాలి. అది కరడానికి ఎక్కువ సమయం తీసుకుని.. లేత పసుపు రంగులోకి మారితే కల్తీది అని భావించాలి.

    ఆయుర్వేద గ్రంథాల ప్రకారం ఆవు నెయ్యి శ్రేష్టమైనది. ఆవు నెయ్యిలో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటుంది. గేదె నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది. పైగా అది రుచిగా ఉంటుంది. ఆవు నెయ్యిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందువల్ల అది జీవక్రియ రేటెం పెంచుతుంది. బరువును తగ్గించడానికి ఉపకరించే పదార్థాలు ఆవు నెయ్యిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పదార్థం ఆవులకు వేసే మేతపై ఆధారపడి ఉంటుంది.