జగన్.. ఆయనో మొండి. ఎవరికీ లొంగని జగమొండి. తన తండ్రి మరణాంతరం ఏకంగా కేంద్రంతో కొట్లాట పెట్టుకున్న నాయకుడు. దిగ్గజ నేతలకూ చుక్కలు చూపించారాయన. అలాంటి నేత మాటను ఇప్పుడు పార్టీలోనే లెక్కచేయడం లేదట. సొంత పార్టీ నేతలే ఝలక్ ఇస్తున్నారట. ఏ జగన్‌ను అయితే.. తమ దేవుడని కీర్తించారో, ఏ జగన్ తమ అధినాయకుడి అని చెప్పుకుని ఊరూరా తిరిగి దండోరా వేశారో ఇప్పుడు ఆ జగన్ మాటలను ధిక్కరిస్తున్నారు.
Also Read: తిరుపతి వైసీపీ ఎంపీ టికెట్.. షాకిచ్చిన జగన్!?
జగన్ మాట వేదంగా భావించే నేతలు ఇప్పుడు తిరుగుబావుట ఎగరేస్తున్నారు. జగన్ టికెట్ ఇస్తే ఆయన బొమ్మ పెట్టుకుని జనంలోకి వెళ్లి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే తోక జాడిస్తున్నారు. జగనా.. అయితే ఏంటనే నిర్లక్ష్య భావం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఇందుకు ఉదాహరణలు కూడా లేకపోలేదు. జగన్ తప్ప మరో నాయకుడు లేని వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కోక్కరుగా బయటకు వస్తున్నారు. నోరు తెరచి అన్నీ బయటపెట్టేస్తున్నారు.
విశాఖలో ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమరనాథ్, గోదావరి జిల్లాలో పి గన్నవరం ఎమ్మెల్యే, గుంటూరులో ఉండవల్లి శ్రీదేవి ఇలా పార్టీ పరువు బజారున పెట్టేశారు. జగన్ మాటలను సైతం కాదని ముందుకు వచ్చేశారు. ఒక ఎమ్మెల్యే మంత్రుల మీద విమర్శలు చేస్తే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ కుడి భుజం లాంటి నాయకుడి మీదనే బాణాలు వేశారు. మరో ఎమ్మెల్యే అయితే ఏకంగా జగన్ సామాజికవర్గాన్నే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలు ఆరోపణలు చూస్తుంటే పార్టీ పరువు పోతుందని తెలిసి కూడా ఇంతలా తెగించడం ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: గ్రేటర్ ఫైట్: అభాసుపాలైన పవన్.. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా..?
తమ గోడు వెళ్లబోసుకునేందుకు ఏడాదిన్నర అయినా అధినేత జగన్ దర్శనం దొరకడంలేదట. ఇక జగన్ మొత్తం పాలనను ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా లాగించేస్తున్నారు. జగన్ మానస పుత్రిక గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఎమ్మెల్యేల పాలిట గుదిబండలా మారింది. దాంతో తాము ఉత్త ఎమ్మెల్యేలు అయిపోయామన్న బాధ వారిలో ఉంది. దానికితోడు చిన్నపాటి పలుకుబడి ఉపయోగించి ఏ పనిని చేసుకోనీయకుండా ఆంక్షలు కూడా ఉన్నాయి. అవినీతి రహిత పాలన అంటే జనాలకు బాగానే ఉన్నా కోట్లు పెట్టి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం గిట్టడం లేదు. అందుకే మరో మూడున్నరేళ్లు ఇలాగే నామమాత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగడమేనా అనే ఆవేదనలో ఉన్నారట.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్