Chilli Powder: మన ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆధునిక జీవన శైలి మనకు ఇబ్బందులు తీసుకొస్తోంది. ఆహార అలవాట్లు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. మనదేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టిల్లు. దీంతో పోర్చుగీసు నుంచి వచ్చిన నావికుడు వాస్కోడిగామా మన దేశ సంపదను వారి దేశానికి తీసుకెళ్లిపోయాడు. మన దగ్గర పండించిన సుగంధ ద్రవ్యాలతో మన దేశ కీర్తి ఖండాంతరాలు దాటింది. మనకు మిరపకాయల వాడకం కూడా పెరిగిపోయింది. కూరల్లో రుచి కోసం మిర్చి పౌడర్ వాడటం సహజంగా మారిపోయింది. కారంతో మనకు ఎన్నో అనర్థాలు ఉన్న సంగతి తెలిసినా దాని వాడకం తగ్గడం లేదు.

కొందరు భోజన ప్రియులు నోటికి కారం లేనిదే భోజనం చేయడం లేదు. ఎర్ర మిరపకాయల పొడిని కూరల్లో వేసుకుని తినేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరమని తెలిసినా పట్టించుకోవడం లేదు. కూరలకు రుచి రావాలంటే కారం ఉండాల్సిందే. కారంతోనే కూర రుచి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కారం పొడిని తీసుకుని రుచికరమైన భోజనం కోసం తహతహలాడుతున్నారు. ఏ కూర చేయాలన్నా అందులో కారం ఉండాల్సిందే. లేకపోతే దాని రుచి వేరుగా ఉంటుంది. పచ్చిమిర్చి వాడినా కారం ఏర్పడదు.

ఎర్ర కారం పొడిని ఎక్కువగా తింటే ఎన్నో అనర్థాలు వస్తాయి. దీన్ని సహజ పరిమాణంలో తింటే ఏం కాదు. కానీ పరిమితికి మించి తింటేనే కడుపుకు మంచిది కాదు. మసాలా దినుసులు డీప్ ఫ్రై చేసినప్పుడు పొట్ట లోపలి భాగంలో అతుక్కుని సమస్యలు సృష్టిస్తుంది. ఎర్ర మిరపకాయలు జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. కడుపులో ఎసిడిటి కలిగిస్తుంది. ఇలా కావడంతో గుండెల్లో మంట వస్తుంది. ఎండు మిరపకాయలతో వినియోగంతో బలహీనత, మూర్చ, మైకం వంటివి కలుగుతాయి.
ఎర్ర మిరపకాయలను తక్కువగా తినాలి. వీటిని ఎక్కువగా తింటే కడుపులో పుండు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. పొడితో కణాలు, కడుపు, పేగులకు అంటుకోవడం వల్ల అల్సర్ రావడానికి కారణమవుతుంది. స్త్రీలు గర్భధారణ సమయంలో మిరపపొడిని ఎక్కువగా తింటే పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని ప్రతికూల భావాలు ఉన్నందున ఎండు మిరప కాయల పొడిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఏదో రుచి కోసం చిన్న మొత్తంలో వేసుకుంటే సరి.
[…] Also Read: Chilli Powder: స్సైసీ కోసం ఎర్రకారం ఎక్కువగా త… […]