మనం రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే పళ్లు తోముకోవడానికి టూత్ పేస్ట్ ను ఉపయోగిస్తామనే సంగతి తెలిసిందే. మన పూర్వీకులు టూత్ పేస్ట్ కు బదులుగా వేప పుల్లను వినియోగించగా ప్రస్తుతం టూత్ పేస్ట్ ఆ స్థానంలోకి వచ్చి చేరింది. కార్పొరేట్ కంపెనీలు సైతం కొత్త తరహా ప్రచారాలతో టూత్ పేస్ట్ ను మార్కెటింగ్ చేస్తున్నాయి. అయితే వైద్య నిపుణులు మాత్రం టూత్ పేస్ట్ వల్ల పళ్లకు మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు.
టూత్ పేస్ట్ ను తయారు చేయడానికి కొన్ని కెమికల్స్ ను ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. ఆ కెమికల్స్ చిగుర్లలోకి వెళ్లి అనారోగ్య సమస్యలకు కారణమవుతుతాయి. టూత్ పేస్ట్ తయారీలో వినియోగించే పాలిథిన్ వల్ల శరీరంలోని అవయవాలకు ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. టూత్ పేస్ట్ తియ్యగా ఉంటుందనే సంగతి మందరికీ తెలిసిందే. అస్పర్టేమ్ అనే కెమికల్ ను వినియోగడం వల్ల టూత్ పేస్ట్ తియ్యగా ఉంటుంది.
ఈ కెమికల్ వల్ల లుకెమియా లాంటి క్యాన్సర్లతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తలనొప్పి, చూపు మందగించడం,పార్కిన్ సన్స్ డిసీజ్ రావడానికి కూడా ఈ కెమికల్ కారణమవుతుంది. టూత్ పేస్ట్ తోముకుంటే నురగ వచ్చేందుకు డైతానోలమైన్ అనే కెమికల్ ను వినియోగిస్తారు. ఈ కెమికల్ లివర్, కిడ్నీలపి ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి.
టూత్ పేస్ట్ లో వాడే సార్బిటాల్ అజీర్ణం, గ్యాస్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. టూత్ పేస్ట్ లో ఉండే ట్రిక్లోసన్ అనే కెమికల్ గుండె, క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలకు కారణమవుతుంది. అందువల్ల టూత్ పేస్ట్ ను వినియోగించకుండా ఉంటే మంచిది.