Mosquitoes Bite: దోమలు కుట్టనివారు ఈ భూమిపై బహుశా ఉండరేమో! ప్రతీ ఇంట్లో దోమలు కనిపిస్తాయి. దోమ చూసేందుకు చిన్న క్రిమి. కానీ దానికాటు మనిషి ప్రాణానికి పెద్ద ముప్పు తెస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలనే తీస్తుంది. అయితే దోమలు కొందరిని మాత్రమే సెలక్టివ్‌గా ఎంచుకుని ఎక్కువగా కుడతాయట. కొంతమంది జోలికి అస్సలు వెళ్లవట.

మనుషుల్ని కుట్టేది ఆడ దోమలే..
నిజానికి ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఇవి రక్తం ద్వారా మన శరీరం నుంచి ప్రోటీన్లు సేకరిస్తాయి. అందునా కొన్ని బ్లడ్ గ్రూపుల వారిని ఎక్కువగా కుడుతున్నట్లు అధ్యయనాలు తెల్పుతున్నాయి. ముఖ్యంగా A–గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయి. ఐతే O బ్లడ్ గ్రూప్ వ్యక్తులను అంతకంటే రెట్టింపు కుడతాయి.
Also Read: America- India: మినీ ఇండియాగా మారుతున్న అమెరికా.. అగ్రరాజ్యాన్ని ఆక్రమిస్తున్న భారతీయులు!
మన శ్వాస ద్వారా గ్రూప్ గుర్తింపు..
మన రక్తం ఏ గ్రూపో తెలుసుకోవాలంటే మనం ల్యాబ్‌కు వెళ్లాలి. రక్తం బయటకు తీసి.. దానికి రసాయనాలు కలిపి ఒక నిమిషం ఆగతే గానీ మనది ఏ గ్రూప్ బ్లడ్ అనేది తెలియదు. కానీ దోమలకు ఇవేమీ అవసరం లేదు. మన వదిలే శ్వాస ద్వారా మన బ్లడ్ గ్రూప్‌ను దోమలు గుర్తిస్తాయి. కార్బన్ డయాక్సైడ్‌తోపాటు, దోమలు లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా, చెమట ద్వారా విడుదలయ్యే ఇతర పదార్థాలను వాసన చూడగలవు. లాక్టిక్ ఆమ్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా దోమలు గుర్తించగలుగుతాయి. అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉన్నవారిని కూడా దోమలు అధికంగా కుడతాయి.

2011లో పరిధోధన..
శాస్త్రవేత్తలు దోమ కాటు, అవి ఎవరిని ఎక్కువగా కుడుతాయని 2011లో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వీరి పరిశోధనల్లో A, O బ్లడ్ గ్రూపు వారిని దోమలు ఎక్కువగా కుడుతున్నట్లు నిర్ధారించారు. దోమకాటుతో కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో బయటపడింది. బీరు ఎక్కువగా తాగే వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయట. రోజూ బీరు తాగేవారి చెమట ద్వారా ఇథనాల్ విడుదలవుతుంది. కాబట్టి బీర్ ప్రియులకు దోమల బెడద ఎక్కువేనని చెప్పవచ్చు. అలాగే గర్భిణులను కూడా దోమలు ఎక్కువగా కుడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం గర్భిణుల శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వారి శరీరం నుంచి ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. దానివల్ల దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయి.
ఇవన్నీ ఆశ్చర్యం అనిపించనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో నిర్ధారణ అయిన నిజాలు. దోమకాటుకు కారణాలు, అవి ఎవరిని ఎక్కువగా కుడతాయో తెలిసిన వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.
Also Read: CM KCR Bihar Tour: బిహార్ లో కేసీఆర్ లుక్ చూసి అందరు షాక్