Homeజాతీయ వార్తలుAmerica- India: మినీ ఇండియాగా మారుతున్న అమెరికా.. అగ్రరాజ్యాన్ని ఆక్రమిస్తున్న భారతీయులు!

America- India: మినీ ఇండియాగా మారుతున్న అమెరికా.. అగ్రరాజ్యాన్ని ఆక్రమిస్తున్న భారతీయులు!

America- India: అమెరికా.. ప్రపంచంలో అంత్యంత సంపన్న దేశం. అన్ని దేశాలను శాసించే స్థితిలో ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా అంటే భారతీయులకు బహుదూరపు దేశం. అక్కడ ఉత్తరం రాస్తే ఇండియాలో ఒక పల్లెకు చేరడానికి కనీసం పక్షం రోజుల పట్టేంది. మళ్లీ జవాబు రాస్తే 15 రోజులకి కానీ చేరేది కాదు. అంటే ఇద్దరి మధ్య సమాచార బదిలీకి తక్కువలో తక్కువ నెల రోజులు పట్టేంది. ఫోన్లున్నా కాల్స్‌ ఖరీదెక్కువ. ఐఎస్‌డీ బుక్‌ చేసి ‘హలో బాగున్నావా నాన్నా!‘ అన్నదానికే రూ.10 నుంచి రూ.15 చెల్లించాల్సి వచ్చేది. దేశం కాని దేశంలో మావాడు ఎలా ఉన్నాడో అని ఇండియాలో తల్లిదండ్రులు, అమ్మా–నాన్న ఎలా ఉన్నారో అని అమెరికాలో కొడుకు తపించిపోయేవారు. సొంత ఊరిమీద, ఇంటి మీద, బంధువుల మీద, స్నేహితుల మీద మమకారముండేది. ఇండియా ప్రయాణమంటే ప్రాణం లేచొచ్చేది. సొంత ఊరికి ఫ్లైట్లో దిగగానే చంద్రమండలం నుంచి వచ్చినవాడిని చూసినట్టు చూసేవారు. అమెరికా నుంచి సెంటు బాటిల్‌ తెచ్చినా, ఎలక్ట్రిక్‌ షేవర్‌ తెచ్చినా, వాక్‌మెన్‌ తెచ్చినా అపురూపంగా చూసేవారు. కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని అమెరికా నుంచి వచ్చిన కొడుకూ ఆస్వాదించేవాడు. క్రమక్రమంగా రోజులు మారాయి. రెండు దేశాల మధ్య భౌతిక దూరం అలాగే ఉన్నా సాంకేతికత అభివృద్ధితో దగ్గరగా ఉన్నట్టే ఉంది. ‘అమెరికా నుంచి వస్తున్నాను. ఏం కావాలో చెప్పు‘ అని అమెరికాలో ఉన్నవాడు ఇండియాలో ఉన్న ఫ్రెండ్‌ నో, బ్రదర్నో అడిగితే అక్కడా ఇక్కడా రేట్లు కంపేర్‌ చేసుకుని ‘పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడే అన్నీ దొరుకుతున్నాయిలేరా. ఏమీ వద్దు‘ అంటున్నారిప్పుడు. కుదిరితే ఫ్లైటెక్కే ముందు డ్యూటీ ఫ్రీలో ఫలానా సరుకు తీసుకురమ్మంటున్నారు తప్ప అమెరికాలో ఇక్కడ లేనివేవో ఉంటాయనే అపోహల్లో ఎవరూ ఉండట్లేదు.

ఇండియా వెళ్లాలనే కోరిక తగ్గుతోంది..
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్‌లో తరచూ మాట్లాడుకోవడం, వీడియోకాల్స్‌లో మాట్లాడడం ద్వారా అందరం ఒక్కచోట ఉన్నట్లుగానే భావిస్తున్నారు. దీంతో అమెరికాలో ఉన్నవాళ్లకి కూడా తరచూ ఇండియా వెళ్లాలనే కోరిక తగ్గుతోంది. వెళ్లినా ఒకప్పటి అటెన్షన్‌ ఉండట్లేదు. కారణమేంటంటే ఎవరూ ఎవర్నీ మిస్సవ్వట్లేదు. వీడియో కాల్స్‌ లో తరచూ మాట్లాడుకుంటున్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో ‘మనం‘, మేము‘, ‘కుటుంబం’ లాంటి పేర్లు పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ టచ్‌లో ఉంటున్నారు. అమెరికాలోనే పుట్టి పెరుగుతున్న పిల్లలు కూడా ఇండియాలోని తమ కజిన్స్‌తో తరచూ వీడియో కాల్స్‌తో టచ్‌ లోనే ఉంటున్నారు.

Also Read: CM KCR Bihar Tour: బిహార్ లో కేసీఆర్ లుక్ చూసి అందరు షాక్

లైవ్‌లో వేడుకలు..
అమెరికాలో అయినా ఇండియాలో అయినా పుట్టిన రోజు, మ్యారేజ్‌ డేలు, ఎంగేజ్‌మెంట్‌ వంటి కార్యక్రమాలు లైవ్‌లో చేసుకుంటున్నారు. కరోనా పుణ్యమా అని చివరకు పెళ్లిళ్లు కూడా ఆన్‌లైన్‌లో చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక అమెరికాలో ‘మనబడి‘ లాంటివి రావడంతో భాషాపరంగా తమ పిల్లలు ఏదో మిస్సైపోతున్నారన్న బాధ ఉండట్లేదు.

అమెరికాలోనే సెటిల్‌ అవుతున్నారు..
ఎలా చూసుకున్నా అన్ని విధాలుగా అమెరికా బాగుంటోంది. అందుకే ఒకప్పట్లాగ ‘పది పదిహేనేళ్లు అమెరికాలో పని చేసి తిరిగి ఇండియా వెళ్లిపోవాలి’ అనే ఆలోచన చాలామందిలో తగ్గిపోయింది. అమెరికాలో సెటిలైపోవడానికే మొగ్గు చూపుతున్నారు. గ్రీన్‌ కార్డ్, సిటిజెన్షిప్‌ లక్ష్యంగా పని చేస్తున్నారు. ఆస్తులు కూడా ఇండియాలో పేరెంట్సుంటే కొంటున్నారు. లేకపోతే ఉన్నవి అమ్మేసుకుని పట్టుకుపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులను కూడా అమెరికా తీసుకెళ్లి తమ వద్దనే ఉంచుకుంటున్నారు. ఫలితంగా అమెరికాని సొంత దేశంగా భావిస్తున్న భారతీయులు క్రమంగా పెరుగుతున్నారు.

ఇక్కడే కథ మొదలు..
తన వరకు మాత్రమే సుఖంగా బతకడానికి కావల్సింది సంపాదించుకోవాలనుకోవడం ఫారిన్‌ కంట్రీల్లో ఎక్కువగా ఉంటుంది. భారతీయులకు సంపాదనపై ఆకలెక్కువ. ఎందుకంటే వెనకాలున్న పిల్లలకి, మనవలకి కట్టబెట్టాలనే తపన. అది మనవాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది. ఏ దేశమేగినా ఆ గుణం మాత్రం మారదు కదా. అందుకే విద్యార్థులుగానో, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగానో అమెరికాకి వెళ్లిన వారు దాంతో ఆగట్లేదు. ఇండియాలో ఏయే రంగాల్లో మనవాళ్లు సంపాదిస్తున్నారో ఆయా రంగాల్లో చేతులు పెట్టి చక్రాలు తిప్పేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్, డైమండ్స్‌ వ్యాపారం, పెట్రోల్‌ బంకులు, రెస్టారెంట్స్, బొటిక్స్‌ ఇలా ఒకటి కాదు..రకరకాల రంగాల్లో దూసుకుపోతున్నారు.

రాజీకీయల్లోనూ ఇండియన్స్‌…
అమెరికాలో ఉంటున్న భారతీయులు అక్కడి రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిటీ లెవెల్‌ రాజకీయాలతో మొదలుపెట్టి, సత్తా చాటుకుని క్రమంగా డెమాక్రటిక్‌ పార్టీ తరఫునో, రిపబ్లిక్‌ పార్టీ తరపునో భవిష్యత్తులో టికెట్‌ పొంది గవర్నర్ల స్థాయికి ఎదగాలనే కోరికతో ఉంటున్నారు. ఆ రెండు పార్టీల్లోని టాప్‌ లీడర్స్‌తో స్నేహం చేసి పీఆర్‌ పెంచుకుంటున్నారు. అంతా ఒక ఆర్గానిక్‌ వేలో వారి ఇష్టమైన రంగాల్లో పాగా వెయ్యడానికి మార్గాలు వేసుకుంటున్నారు.

America- India
America- India

పెరుగుతున్న భారతీయుల జనాభా..
ఇదిలా ఉంటే భారతీయుల జనాభా అమెరికాలో పెరుగుతోంది. అయితే పెరుగుతున్న ఆ ఇండియన్‌ పాపులేషన్లో 90% మంది ఆ దేశం స్టాండర్డ్స్‌ని బట్టి బాగా సంపాదిస్తున్నవారే. వారందరికీ ఇల్లు కొనుక్కోవడం జీవిత ధ్యేయాల్లో ఒకటి. అందుకే ఈ మధ్య ఆశ్చర్యకరంగా అమెరికన్‌ బిల్డర్స్‌ కూడా ఇండియన్‌ కష్టమర్స్‌ని ఆకట్టుకోవడానికి ‘ఈస్ట్‌ ఫేసింగ్‌ హోంస్‌‘ అంటూ వాస్తు ప్రకారం కట్టి అమ్ముతున్నారు. అలా క్రమంగా ఇండియన్‌ సెంటిమెంట్స్‌ని, సిస్టంని అమెరికాలో వారికి తెలియకుండానే ప్రవేశ పెడుతున్నారు మనవాళ్లు.

సైలెంట్‌ ఆక్రమణ..
అమెరికాలోని పలు నగరాలు ఇండియన్స్‌తో నిండిపోతున్నాయి. మార్నింగ్‌ వాక్‌లో చూస్తే ఇండియన్స్‌ విపరీతంగా కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల ర్యాండంగా తల తిప్పి పరికిస్తే కచ్చితంగా కనీసం ఒక్క ఇండియన్‌ అయినా కనిపించకుండా ఉండడు. వైట్‌ అమెరికన్స్‌ అయినా, ఆఫ్రో అమెరికన్స్‌ అయినా తమ వరకు సంపాదించుకుని పిల్లలకి మహా అయితే ఎడ్యుకేషన్‌ వరకు ఇచ్చి వదిలేసి తమ కాళ్ల మీద బతకమంటారు. ఆ గ్యాప్‌ని మనవాళ్లు ఫిల్‌ చేసి ఉన్న దాంతో సంతృప్తి చెందుదామనే కాన్సెప్ట్‌ లేకుండా సంపాదనే ధ్యేయంగా అడుగులు ముందుకేస్తున్నారు. ‘పిల్లలు పెద్దవుతున్నారు.. మన కల్చర్‌ తప్పుతారు. ఇండియన్‌ సంబంధం దొరకడం కష్టమవుతుందేమో’ లాంటి పాత సంప్రదాయాల నుంచి బయటకు వస్తున్నారు. అక్కడి వాళ్లని లవ్‌ చేశామంటే పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. తాము ఇండియన్స్‌ అయినా తమ పిల్లలు అమెరికన్స్‌ కాబట్టి వాళ్లు పుట్టిన దేశం కల్చర్‌ కి తగ్గట్టుగా పెరగడానికి కొంతమంది తల్లిదండ్రులు అభ్యతంతరం చెప్పట్లేదు. ఆ విధంగా సెకండ్‌ జెనెరేషన్‌ అక్కడ పూర్తిగా జెండా పాతేస్తోంది.

విస్తరిస్తున్న భారతీయం..
ఈ మార్పులన్నీ అమెరికా భవిష్యత్తులో మరింత ఇండియనైజ్‌ అవుతుందనేదానికి సంకేతాలు. ఈ పాజిటివ్స్‌తోపాటు మనవాళ్లు అక్కడ ఎదుర్కోవాల్సిన నెగెటివ్స్‌ కూడా ఉంటాయి. ఈ ఆధిపత్యాన్ని అందరూ తట్టుకోలేరు. అసూయతో ద్వేషం పెంచుకుని రేసిజం దాడులు చేస్తారు. ఇప్పటికే అక్కడక్కడ చూస్తున్నాం. అవి మరింత పెరగకుండా ఉండలాంటే మన వాళ్లు అందరితో మమేకమై బతకాలి.

Also Read:BJP-TDP alliance : బీజేపీ-టీడీపీ మళ్లీ కలుస్తాయా? బాబు ఎన్డీఏలో చేరుతాడా? అసలు ప్లాన్ ఏంటి?

 

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular