https://oktelugu.com/

Childrens : తినడానికి పిల్లలు మారం చేస్తున్నారా.. అయితే ఇలా కొత్తగా ట్రై చేసి తినిపించేయండి!

కేవలం గోధుమపిండితో మాత్రమే చపాతీలు చేయకుండా మల్టీగ్రెయిన్ పిండితో చపాతీలు చేయండి. వీటివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇలా చేసిన చపాతీలను సన్నగా కత్తిరించుకోవాలి. అలాగే కూరగాయలను చిన్న ముక్కలుగా తరిగి, సన్నగా కత్తిరించుకున్న చపాతీలతో నూడిల్స్ తయారు చేసి ఇవ్వండి. రోజూ ఒకే రకమైన చపాతీలు, ఇడ్లీలు, దోసెలు కాకుండా రోజుకో కొత్తరకం చేయండి.

Written By:
  • NARESH
  • , Updated On : August 12, 2024 / 06:07 AM IST

    Childrens

    Follow us on

    Childrens : ప్రస్తుతం కాలంలో పిల్లలు ఆరోగ్యమైన ఆహారం కంటే ఫాస్ట్‌ఫుడ్స్ తినడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పానీపూరి, నూడిల్స్, పాస్తా వంటి వాటిని మూడు పూటలు ఆహారంగా ఇచ్చిన అతిగా తింటారు. కానీ అన్నం, పప్పు, నెయ్యి వంటివి మాత్రం తినడానికి చాలా మారం చేస్తుంటారు. కొందరి ఇంట్లో అయితే ఈ ఆహారం విషయంలో పిల్లలు యుద్ధాలే చేస్తుంటారు. అలా అని ఆరోగ్యమైన పదార్థాలు తినకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పిల్లలు ఇష్టమైన ఆహారాన్నే పోషకాలతో కొత్తగా తయారు చేసి ఇవ్వండి. అలా చేసి ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

    కేవలం గోధుమపిండితో మాత్రమే చపాతీలు చేయకుండా మల్టీగ్రెయిన్ పిండితో చపాతీలు చేయండి. వీటివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇలా చేసిన చపాతీలను సన్నగా కత్తిరించుకోవాలి. అలాగే కూరగాయలను చిన్న ముక్కలుగా తరిగి, సన్నగా కత్తిరించుకున్న చపాతీలతో నూడిల్స్ తయారు చేసి ఇవ్వండి. రోజూ ఒకే రకమైన చపాతీలు, ఇడ్లీలు, దోసెలు కాకుండా రోజుకో కొత్తరకం చేయండి. బీట్‌రూట్, క్యారెట్, పాలకూర, పుదీనాతో చేసి ఇవ్వండి. ఇవి కలర్‌ఫుల్‌గా ఉండటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు.

    పిల్లలకు పానీపూరీ అంటే బాగా ఇష్టం ఉంటుంది. కానీ వీటిని తినిపించడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ఆకుకూరలతో పానీపూరీ చేసి చేయండి. మసాలా కూరకు బదులు పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి పెట్టండి. రైస్ తినడానికి ఇష్టపడకపోతే సోయాతో కానీ, అన్ని కూరగాయలు కలిపి కిచిడిలా చేసి ఇవ్వండి. కొందరు పిల్లలు పాలు తాగాడానికి అస్సలు ఇష్టపెట్టుకోరు. అలాంటప్పుడు ఏదైనా ఒక ఫూట్‌తో మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. పిల్లలు ఏదైనా పెద్దవాళ్లను చూసి నేర్చుకుంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్లు అన్ని రకాల పదర్థాలు తినేలా అలవాటు చేయండి. ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్లకు ప్రతి ఐటెమ్‌ను వాళ్లకి నచ్చే కార్టూన్‌లా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు.

    కొందరు పిల్లలు మొబైల్, టీవీ చూస్తూ తింటారు. ఈ అలవాటు మంచిది కాదు. పిల్లలకు అలా గ్యాడ్జెట్స్ ఇచ్చే బదులు తినేటప్పుడు మీరే కొత్త కొత్త స్టోరీలు చెబుతుంటే వాళ్లు ఇంట్రెస్ట్‌గా వింటూ తినేస్తారు. వర్క్‌లో బిజీగా ఉండి వాళ్లను ఒంటరిగా టీవీ చూస్తూ తినిపించవద్దు. ఎంత బిజీగా ఉన్న పిల్లలకు కాస్త సమయం కేటాయించి వాళ్లు తినే వరకు అక్కడే ఉండండి. అప్పుడప్పుడు పిల్లలను వంటగదలోకి కూడా తీసుకెళ్లండి. ఏ పదార్థం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామో, వాటి ప్రయోజనాలను పిల్లలకు తెలియజేయండి. దీంతో వాళ్లకు ఫుడ్‌పై కాస్త అవగాహన పెరిగి ఆరోగ్యమైన ఫుడ్స్ తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. పిల్లలకు పెట్టే ఫుడ్‌లో పంచదార వాడకం తగ్గంచాలి. అవసరమైతే కొంచెం బెల్లం వాడాలి. సాయంత్రం పూట స్నాక్స్‌గా చిప్స్ వంటివి కాకుండా ఇంట్లోనే చేసిన డ్రైఫ్రూట్స్ లడ్డూ, పల్లీలు, నువ్వులతో చేసిన చెక్కిలు, రాగి లడ్డూలు చేసి ఇస్తే ఆరోగ్యానికి మంచిది.