Iraq : వివాహ వయసు తగ్గిస్తారట.. మరీ అంత తక్కువకా.. ఏంటీ తెలివి తక్కువ చర్య!

అమ్మాయిల హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు సంఘాలు ఉద్యమిస్తున్నాయి. సమానత్వ హక్కు కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఓ దేశం మాత్రం తెలివి తక్కువ చర్యకు దిగుతోంది. ఉన్న హక్కులను హరించేలా చట్టం చేయాలనుకుంటోంది.

Written By: Raj Shekar, Updated On : August 11, 2024 9:34 pm

The minimum age of marriage in Iraq has been lowered to 9 years

Follow us on

Iraq : స్వాతంత్య్రానికి పూర్వం.. స్వాంతత్య్రం వచ్చిన తర్వాత కూడా పేదరికం.. అక్షరాస్యత లేకపోవడం.. అధిక సంతానం తదితర కారణాలతో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు.. బాల్య వివాహాలు జరిగేవి. అయితే అక్షరాస్యత పెరుగుతున్న నేపథ్యంలో వివాహ వయసు కూడా పెరుగుతోంది. సంతానం కూడా తగ్గుతోంది. ఒకప్పుడు ఒక జంటకు పది, పన్నెండు మంది పిల్లలు ఉండేవారు. తర్వాత ఆ సంఖ్య అరడజనుకు వచ్చింది. ఇప్పుడు ఒక్కరు లేదా ఇద్దరికి చేరింది. అయితే కొన్ని ముస్లిం దేశాల్లో సంతానంపై ఇప్పటికీ పరిమితి లేదు. సంతానం నియంత్రణలో ఉన్న దేశాల్లో చట్టాలు, నిబంధనలు కచ్చితంగా అమలవుతున్నాయి. భారత దేశంలో అయితే.. 30 ఏళ్లు వచ్చే వరకు కూడా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు.. అబ్బాయిలు ఆసక్తి చూపడం లేదు. చదువులు, ఉద్యోగం, సంపాదనపై దృష్టిపెడుతున్నారు. జీవితంలో స్థిరపడిన తర్వాతనే పెళ్లి అంటున్నారు. ఇక వైద్యులు కూడా వివాహ వయసును నిర్ధారించారు. దానికి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక నిర్ణయానికి వచ్చారు. కాస్త అటూ ఇటుగా ఉన్నా.. దాదాపు సరి సమానంగానే ఉన్నాయి. అమ్మాయి వివాహ వయసు 18, అబ్బాయి వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది. కొన్ని దేశాలు ఈ వయసు కూడా పెంచేందుకు యత్నిస్తున్నాయి. కానీ ఇరాక్‌ మాత్రం వివాహ వయసును కుదించాలనుకుంటోంది. కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదించాలన్న ఆలోచనలో ఉంది. ఈమేరకు చట్టం చేయాలని కూడా భావిస్తోంది.

ప్రస్తుతం 18 ఏళ్లు..
ఇరాక్‌లో ప్రస్తుతం కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.. అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించనున్నారు. కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్‌ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకునేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో మహిళ హక్కులను ఈ చట్టం హరిస్తుంది. బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు మంటగలుపుతుందన్న ఆందళన వ్యక్తమవుతోంది.

బిల్లు అమోదం పొందితే..
ఇరాక్‌ ప్రస్తుతం ప్రవేశపెట్టబోతున్న బిల్ల ఆమోదం పొందితే, బాలికల వివాహ వయసు 9 ఏళ్లుగా, బాలుర వివాహ వయసు 15 ఏళ్లుగా ఉటుంది. ఇది పెరిగిన బాల్య వివాహాలు, దోపిడీల భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య మహిళల హక్కులు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని విమర్శకులు వాదించారు. మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకారం, ఇరాక్‌లో 28 శాతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపు వివాహాలు జరుగుతున్నట్లు గుర్తించింది. అయితే ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. తాజాగా మరోమారు బిల్లు పెటే‍్ట ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.