Mehndi: ఒకప్పుడు ఎంత దూరంలో ఉన్నా సరే చెట్టు ఆకు తెచ్చుకొని మైదాకు పెట్టుకునేవారు. అదేనండి గోరింటాకును ఇష్టపడేవారు. కానీ, గోరింటాకు దొరకడం లేదు. మరో రీజన్ ఏంటంటే.. కావాల్సిన డిజైన్ పెట్టుకోవాలి అంటే ఈ గోరింటాకుతో పెట్టుకోలేరు. అంటే అందమైన డిజైన్ కావాలి అంటే మెహందీ పెట్టుకోవాల్సిందే. ఇదిలా ఉంటే ఈ మెహందీ పెట్టుకుంటే కొందరిలో కాళ్ళు, చేతులకి అలర్జీ వచ్చే సమస్య ఉంది. దీని కారణంగా కాళ్ళు చేతులు ఎరుపు, దురద, మంటలు వంటివి వస్తుంటాయి. మరి ఆ సమస్యల్ని దూరం చేసుకునేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసా?
మార్కెట్ లో వివిధ రకాల మెహిందీలు లభిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా కెమికల్స్ ఉండటం వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయి. మెహందీ అప్లై చేసిన తర్వాత మీకు అలర్జీ అనిపించినప్పుడు చేతులకి ఐస్‌ని అప్లై చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో పాటు అలోవెరా జెల్ కూడా రాయవచ్చు.ఇలా చేయడం వల్ల చర్మం చల్లబడుతుంది. అలోవెరా జెల్ రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే ఉంచి చల్లని నీటితో కడిగండి. రిలీఫ్ అనిపిస్తుంది.
ఇవే కాదు మీకు ఈ మంట, దురద వంటి ఎలర్జీని దూరం చేసుకోవాలి అంటే నిమ్మరసం కూడా వాడవచ్చు. దీనికోసం నిమ్మరసాన్ని తీసుకుని గుడ్డలో వేయాలి. దీనిని అలర్జీ ఉన్న ప్రదేశంలో రాసి 10 నిమిషాలు పాటు ఉంచితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మెహందీ వల్ల వచ్చే అలర్జీ దూరం అవుతుంది. మరో పరిష్కారం ఏంటంటే కొబ్బరి నూనె కూడా వాడొచ్చు. దీని వల్ల కూడా దురద తగ్గుతుంది. బర్నింగ్ సెన్సెషన్ నుంచి ఉపశమనం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు చేతులకి కొబ్బరి నూనె రాసుకొని పడుకోండి.
మీరు మెహందీని పెట్టుకోవాలి అంటే ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిందే. మెహందీని పెట్టుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓ చోట మెహందీ రాసి కాసేపు వదిలేయాలి. మీకు ఏదైనా చిరాకు అనిపిస్తే ఆ మెహందీ వాడవద్దు. మెహందీని అప్లై చేశాక మంట, దురదగా ఉంటే వెంటనే క్లీన్ చేసుకోవాలి. కాసేపు తర్వాత కూడా మీకు వచ్చిన ఎలర్జీ తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.