https://oktelugu.com/

Health Tips : మళ్లీ మళ్లీ ఈ పదార్థాలను వేడి చేస్తున్నారా.. మీ ఆరోగ్యం గోవిందా!

ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల పదార్థాలు అసలు వేడి చేయకూడదు. వాటిని పొరపాటున ఒక్కసారి వేడి చేసిన కూడా మీరు తినే పదార్థం విషం అవుతుంది. మరి పూర్తిగా వేడి చేయకూడని ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Srinivas
  • , Updated On : December 21, 2024 / 07:32 AM IST

    Reheating becomes poisonous

    Follow us on

    Health Tips :  కొందరు కుటుంబ సభ్యులకు సరిపడా ఆహారం వండుతారు. మరికొందరు మిగిలితే పర్లేదు.. ఇంకో పూట తినవచ్చని కాస్త ఎక్కువగానే వండుతారు. ఇలా వండిన ఫుడ్ ఉండిపోతే చల్లగా అయిపోతే అసలు ఎవరికి తినాలని ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని చాలా మందికి ఉంటుంది. ఏ సీజన్‌ అయిన తినే ఫుడ్ ఉండిపోతే రెండు నుంచి మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఆ తర్వాత మళ్లీ వేడిచేసుకుని మరి తింటారు. చేసిన వంటలు చల్లగా తిన్నా పర్లేదు. కానీ ఫ్రిడ్జ్‌లో ఉంచుకుని, మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పడేయడం ఎందుకు అనవసరంగా వేస్ట్ అవుతుందని కొందరు ఫ్రిడ్జ్‌లో ఉన్న వంటలను వేడి చేసి మళ్లీ తింటారు. తినే ఫుడ్‌ను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు నాశనం అవుతాయి. అలాగే ఆరోగ్యానికి హానికరం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల పదార్థాలు అసలు వేడి చేయకూడదు. వాటిని పొరపాటున ఒక్కసారి వేడి చేసిన కూడా మీరు తినే పదార్థం విషం అవుతుంది. మరి పూర్తిగా వేడి చేయకూడని ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    పాలకూర
    ఇతర ఆకుకూరలతో పోలిస్తే పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని పప్పు లేదా కూరలు చేస్తుంటారు. అయితే కొందరు పాలకూరను ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటారు. ఇలా తినడం వల్ల ఇందులోని పోషకాలు విషంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    అన్నం
    కూరలు ఎక్కువగా వండిన లేకపోయిన అన్నం మాత్రం ప్రతీ ఒక్కరూ కూడా ఎక్కువగానే వండుతారు. అసలు ఒక్క మెతుకు కోసం చాలా మంది కష్టాలు పడుతున్నారు. అన్నం మిగిలిపోతే వేడి చేసుకుని తింటారు. కానీ పడేయరు. ఇలా మళ్లీ అన్నం వేడి చేసుకుని తింటే అందులోని షోషకాలు నాశనం అయిపోతాయి. ఇందులో బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    బంగాళాదుంపలు
    పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందికి బంగాళదుంప కూర అంటే ఇష్టం. అయితే ఈ కూర మిగిలిపోతే వేడి చేసుకుని అసలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మళ్లీ వేడి చేస్తే ఇందులో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇక ఇందులోని పోషకాలు శరీరానికి లభించవు.

    మాంసాహారం
    నాన్‌వెజ్ అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మాంసం ప్రియులకు ఎన్ని రోజులది వేడి చేసిన ఇచ్చిన తినేస్తారు. చాలా మంది చికెన్ వండిన రెండు రోజుల వరకు తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్లీ మళ్లీ వేడి చేయకూడదని, చేస్తే తినే ఫుడ్ విషం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసాహారాన్ని ఒక్కసారి వండిన తర్వాత మళ్లీ వేడి చేసి తినకూడదని నిపుణులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.