https://oktelugu.com/

కరోనాపై మరో అధ్యయనం.. షాకింగ్ న్యూస్

కరోనా పేరు చెబితే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా క్రమంగా అన్నిదేశాలకు పాకింది. కరోనా మహమ్మరికి ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మందికి కరోనా బారినపడ్డారు. కొంతమంది కరోనాను జయించి బ్రతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా విషయంలో రోజుకో షాకింగ్ న్యూస్ బయటపడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా కరోనా గురించి షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. జిత్తులమారి కరోనా ఉసిరివెల్లిలా రంగులు మారుస్తూ సైంటిస్టులకు సవాల్ విసురుతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటికీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2020 / 12:35 PM IST

    carona spreading

    Follow us on

    కరోనా పేరు చెబితే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా క్రమంగా అన్నిదేశాలకు పాకింది. కరోనా మహమ్మరికి ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మందికి కరోనా బారినపడ్డారు. కొంతమంది కరోనాను జయించి బ్రతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా విషయంలో రోజుకో షాకింగ్ న్యూస్ బయటపడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా కరోనా గురించి షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.

    జిత్తులమారి కరోనా ఉసిరివెల్లిలా రంగులు మారుస్తూ సైంటిస్టులకు సవాల్ విసురుతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటికీ కూడా సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కరోనా గురించి రోజుకో విషయం వెలుగు చూస్తుండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అది ఏమేరకు పని చేస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల డబ్ల్యూహెచ్ఓ కరోనా వైరస్ గాలి ద్వారా ఎక్కువగా వ్యాపిందని ప్రకటించింది. అయితే తాజాగా అధ్యాయనంలో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిస్తుందని తేలింది. గాలి ద్వారా 7 నుంచి 8మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా వైరస్ సోకుతుందని వెల్లడైంది.

    కరోనా తొలినాళ్లలోనే బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి 24మంది కరోనా వ్యాపించింది. దీంతో అప్పట్లోనే గాలి ద్వారా కరోనా సోకుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో మాస్కుల నిబంధన లేకపోవడంతో గాలి ద్వారా వారికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే గాలిలో కరోనా వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించలేదని పలు వైద్య సంస్థలు ప్రకటించడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    ప్రస్తుతం ప్రతీఒక్కరు మాస్కులు ధరిస్తున్నారు. భౌతికదూరం పాటించడం.. చేతులను శుభ్రం చేసుకోవడం వంటి వాటిని పాటిస్తున్నారు. తాజాగా గాలి ద్వారా కూడా వైరస్ సోకనుందని తేలడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.