కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్..?

గతేడాది డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రజలు మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దేశాల్లో మాత్రమే కొత్త కేసులు నమోదు కావడం లేదు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో నేటికీ లాక్ డౌన్ అమలవుతున్నా లాక్ డౌన్ వల్ల ప్రజలకు […]

Written By: Kusuma Aggunna, Updated On : October 16, 2020 4:47 pm
Follow us on

గతేడాది డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రజలు మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దేశాల్లో మాత్రమే కొత్త కేసులు నమోదు కావడం లేదు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు.

మరోవైపు పలు ప్రాంతాల్లో నేటికీ లాక్ డౌన్ అమలవుతున్నా లాక్ డౌన్ వల్ల ప్రజలకు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిపుణులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లు, వృద్ధులు, పిల్లలు మినహా మిగిలిన వాళ్లు వైరస్ ను ఎదుర్కొని ముందుకు సాగాలని.. కరోనా, లాక్ డౌన్ వల్ల సమయాన్ని వృథా చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ వచ్చినా కరోనాను కట్టడి చేయగలుగుతామని ఖచ్చితంగా చెప్పలేమని.. కరోనా వైరస్ శాశ్వతంగా ఉండిపోవచ్చని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడటం గమనార్హం. పలు వ్యాధులకు వ్యాక్సిన్లు వచ్చినా నేటికీ ఆ వ్యాధులకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయని అందువల్ల కరోనా శాశ్వతంగా పోతుందని చెప్పలేమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

నెదర్లాండ్స్‌లోని యుట్రెక్ట్‌ యూనివర్శిటీ థియారిటికల్‌ ఎపిడిమియాలోజీ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ హాన్స్‌ ఈస్టర్‌బీక్‌ ఈ విషయాలను వెల్లడించారు. అంటువ్యాధుల మాదిరిగా కరోనా ఒక్కో చోట ఒక్కో విధంగా విజృంభించే అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రజల్లో వైరస్ కు వ్యతిరేకంగా ఇమ్యునిటీ పెరుగుతుండటం వల్ల కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తెలిపారు.