Eggs : గుడ్డు సంపూర్ణ ఆహారం అని గుడ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతారనే సంగతి తెలిసిందే. గుడ్లతో ఏ వంటకం చేసినా మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే వేసవిలో గుడ్లు తింటే వేడి చేస్తుందని గుడ్లు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.
గుడ్లను తినడం వల్ల తక్కువ సమయంలోనే మనకు కడుపు నిండిన భావన కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గుడ్లు తినడం వల్ల ఆకలి తగ్గడంతో పాటు పొట్ట నిండుగా ఉన్న భావన కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. వేసవి కాలంలో ఆకలిగా అనిపిస్తే ఏ సందేహం లేకుండా గుడ్లను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు తగ్గుతాయి.
గుడ్ల విషయంలో అపోహలు వదిలి వీటిని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. గుడ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా సందేహాలు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.