https://oktelugu.com/

Dry Ginger Benefits : శొంఠి ఎన్నో రోగాలను దూరం చేస్తుంది.. ఇలా వాడండి

పాండు రోగానికి శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధం 10 గ్రాములు తీసుకుని దాన్ని 50 గ్రాములు ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని మరగబెట్టి రోజువారీ ఆహారంలో తీసుకుంటే పాండు రోగం తగ్గుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 4, 2023 / 03:32 PM IST
    Follow us on

    Dry Ginger Benefits : మన ఆయుర్వేదంలోఎన్నో రోగాలకు మందులు ఉన్నాయి. అల్లంపై పొట్టును తీసేసి సున్నపు తేటలో ముంచి ఎండబెడితే శొంఠిగా మారుతుంది. దీన్ని దేవభాషలో మహా ఓషది, విశ్వభేషజాల అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది మన శరీరంలోని ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. మూత్రపిండ రోగాలను అరికట్టడంలో బాగా పనిచేస్తుంది.

    శొంఠిలో వీర్య కణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. శ్వాస, దగ్గు, గుండె రోగాలు, బోదకాలు, వాత రోగాలను నయం చేయడంలో దోహదపడుతుంది. కడుపులో గ్యాస్ ఎక్కువైతే గుండెల్లో నొప్పి వస్తుంది. దీని నుంచి బయటపడేందుకు శొంఠి పొడిని చెంచా తేనెతో కలిపి తీసుకుంటే గుండె నొప్పి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

    దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలలో కలిపి తీసుకుంటే విష జ్వరాల నుంచి ఉపశమనం కలుగుతుంది. తలనొప్పి ఉన్న వారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపై పట్టు వేస్తే తలనొప్పి తగ్గుతుంది. దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా చెరకు రసంతో కలిపి తీసుకుంటే ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. దోరగా వేయించిన శొంఠి 50 గ్రాములు పాతబెల్లం 100 గ్రాములు కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజు రెండు పూటల 5 గ్రాముల చొప్పున తీసుకుంటే ఆకలిని పెంచుతుంది.

    వెక్కిళ్లకు కూడా శొంఠి పరిష్కారం చూపుతుంది. పావు చెంచా శొంఠి పొడి, చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడి నీటిలో వేసి రెండు పూటల తాగితే దగ్గు, దమ్ము, ఎక్కిళ్లు పోయేందుకు కారణమవుతుంది. రక్తహీనతకు కూడా మంచి మందులా ఉపయోగపడుతుంది. పాండు రోగానికి శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధం 10 గ్రాములు తీసుకుని దాన్ని 50 గ్రాములు ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని మరగబెట్టి రోజువారీ ఆహారంలో తీసుకుంటే పాండు రోగం తగ్గుతుంది.