Anasuya : అనసూయ భరద్వాజ్ బికినీ వేస్తే ఎలా ఉంటుంది?… ఆ కోరిక కూడా తీర్చేసింది ఈ హాట్ బ్యూటీ. అనసూయ పెళ్లి రోజు తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇందు కోసం ఆమె సాగరతీరంలో సేద తీరారు. భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి వేడుకల్లో మునిగి తేలుతుంది. అనసూయ రొమాంటిక్ గా మారిపోయారు. ఏకంగా టూ పీస్ బికినీ ధరించింది. భర్తను లిప్ కిస్సులతో ముంచెత్తింది. అనసూయ మ్యారేజ్ యానివర్సరీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి . అనసూయ తెగింపుకు జనాలు నోరెళ్ళబెడుతున్నారు.

అనసూయ-సుశాంక్ లది ప్రేమ వివాహం. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట పెద్దలతో యుద్ధం చేసి, ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అనసూయ చదువుకునే రోజుల్లో ఎన్ సి సి క్యాడెట్. ఓ క్యాంపులో సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం ఏర్పడింది. టీనేజ్ లో మొదలైన వీరి పరిచయం పెద్దయ్యాక ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనసూయ ఫాదర్ ససేమిరా అన్నారట.
అప్పుడు తండ్రిని ఎదిరించి ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. దాదాపు ఐదేళ్ల పాటు హాస్టల్ లో ఉందట. అయితే తండ్రి అనుమతి ఇచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారట. ఎట్టకేలకు అనసూయ తండ్రి అనుమతి ఇవ్వడంతో అనసూయ-సుశాంక్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి బర్త్ డే ఇటీవలే సెలబ్రేట్ చేసుకున్నారు. మా వాడు అప్పుడే టీనేజ్ కి వచ్చేశాడని అనసూయ చెప్పారు.
పెళ్లయ్యాక కెరీర్ మీద ఫోకస్ పెట్టిన అనసూయ జబర్దస్త్ యాంకర్ కా ఛాన్స్ దక్కించుకుంది. ఆ షో ఆమె ఫేట్ మార్చేసింది. ఏళ్ల తరబడి ఆ షోలో హాట్ యాంకర్ గా ప్రేక్షకులను అలరించింది. అనసూయ అంటే జనాల్లో ఓ క్రేజ్ ఏర్పడింది. అది ఆమెకు సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అనసూయ బిజీ యాక్ట్రెస్. పలు చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ఆమెకు మంచి పాత్రలు దక్కుతున్నాయి. ఆమె కీలక రోల్ చేసిన విమానం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.