
చిరుధాన్యాలలో ఒకటైన జొన్నలతో జొన్నరొట్టెలు చేసుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. 30 దేశాల ప్రజలు ఆహార ధాన్యంగా జొన్నలను వినియోగిస్తారు. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలు జొన్నల్లో ఉంటాయి. కృష్ణా గోదావరీ పరీవాహక ప్రా౦తాల ఈ పంటను ఎక్కువగా పండిస్తారు. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు కాబట్టి జొన్నరొట్టెను రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
జొన్నరొట్టెను దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో జోవార్, సొర్లుమ్, క్వినోవా అని పిలుస్తారు. ఈ మధ్య కాలంలో జొన్నరొట్టెల వాడకం మరింత పెరిగింది. మధుమేహ రోగులకు జొన్నరొట్టెలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. చపాతీ తినేవాళ్లు సైతం ఈ మధ్య కాలంలో జొన్నరొట్టెలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. జొన్న రొట్టె తినడం వల్ల శరీరానికి 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.
జొన్నరొట్టెలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పీచు లభించడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దూరమవుతాయి. బాలింతలకు జొన్నలు బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు. జబ్బు బారిన పడినవాళ్లు త్వరలో కోలుకోవడానికి బలవర్థకమైన ఆహారం తీసుకుంటే మంచిది. జొన్నరొట్టెలు సులభంగా బరువు పెరగకుండా చేయడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
జొన్నరొట్టెలు చాలా బలవర్ధకమైన అహారం కాగా సిటీల్లో సైతం జొన్నరొట్టెలు తినేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.జొన్నరొట్టెలు తినడం వల్ల ఎముక పుష్టి కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జొన్నలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.