Hing with Hot Water: ఆహార వంటలలో రుచి, సువాసన కోసం ఇంగువను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఆహార పదార్థాలలో ఇంగువను చేర్చడం వల్ల అదనపు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. కూర, సాంబార్, పచ్చళ్ళలో ఇంగువను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. గోరువెచ్చని నీటిలో ఇంగువను కలిపి రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఇంగువ నీళ్లు ఎన్నో వ్యాధులను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇంగువ కిడ్నీలలో పేరుకున్న మలినాలు, వ్యర్థాలను బయటకు పంపించడంలో తోడ్పడుతుంది. గోరువెచ్చని నీటిలో ఇంగువను కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో ఇంగువ వాటర్ తాగితే జలుబు దూరం కావడంతో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: శుక్రవారం సాయంత్రం ఈ వస్తువులను భర్త భార్యకు ఇస్తే చాలు.. అంతా శుభమే!
గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలకు ఇంగువ సులభంగా చెక్ పెడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఇంగువ సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఇంగువను కలిపి తాగితే రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి సమస్యలకు ఇంగువ నీళ్లు చెక్ పెట్టడంలో ఉపయోగపడతాయి.
ఇంగువ వాటర్ రుతు సమయంలో మహిళలకు వచ్చే కడుపునొప్పి సమస్యలకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి. ఇంగువలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కళ్లు పొడిబారకుండా చేస్తుంది
Also Read: అమెరికాకు తెలియకుండా చైనాలో ‘యాపిల్’ 20లక్షల కోట్ల రహస్య డీల్?