
మనలో చాలామంది టీని ఎంతో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువసార్లు టీ తాగేవాళ్లు మనలో చాలామంది ఉంటారు. టీలలో లెమన్ టీ ఒకటి కాగా ఈ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బ్లాక్ టీలో కొద్దిగా నిమ్మరసం పిండి, రుచి కోసం చక్కెర, సుగంధ ద్రవ్యాలు జోడించి సులభంగా లెమన్ టీని తయారు చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో టీలో నల్ల ఉప్పును కూడా కలుపుతారు.
రోజూ టీని తాగడాన్ని ఇష్టపడే వ్యక్తులు లెమన్ టీ తాగితే మంచిదని చెప్పవచ్చు. లెమన్ టీలో విటమిన్ సి, విటమిన్ బి 6, పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. అలెర్జీలు, ఇన్ఫెక్షన్లతో బాధ పడేవాళ్లు లెమన్ టీ తాగడం వల్ల వాటికి సులభంగా చెక్ పెట్టవచ్చు. టీ ఆకులలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
నిమ్మకాయలో ఉండే రక్తస్రావం గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే నిమ్మకాయ మొటిమలు, తామర వంటి చర్మ వ్యాధులను సులభంగా నియంత్రిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నిమ్మకాయ ఎంతగానో తోడ్పడుతుంది. నిమ్మకాయ టీ బరువు తగ్గించడంతో పాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. లెమన్ టీ మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
లెమన్ టీ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది. పాలు లేని ఏ టీలోనైనా నిమ్మకాయను తీసుకోవచ్చు. నిమ్మకాయలో ఉండే ఫైబర్ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.