https://oktelugu.com/

కారు కొనేవాళ్లకు శుభవార్త.. నెలకు రూ.3,555 చెల్లిస్తే కొత్త కారు..?

దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ సంస్థ టాటా మోటార్స్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ ఆఫర్ ద్వారా తక్కువ ఈఎంఐతోనే మంచి కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ఈఎంఐతో టాటా టియాగో కారును ఇంటిని తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. టాటా టియాగో ఈఎంఐ నెలకు 3,555 రూపాయల నుంచి ప్రారంభం కానుండగా రూ.3,555 కట్టడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 25, 2021 / 04:36 PM IST
    Follow us on

    దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ సంస్థ టాటా మోటార్స్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ ఆఫర్ ద్వారా తక్కువ ఈఎంఐతోనే మంచి కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ఈఎంఐతో టాటా టియాగో కారును ఇంటిని తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం.

    టాటా టియాగో ఈఎంఐ నెలకు 3,555 రూపాయల నుంచి ప్రారంభం కానుండగా రూ.3,555 కట్టడం ద్వారా సులభంగా కొత్త కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాటా టియాగో కారు ధర రూ.4.99 లక్షల రూపాయల నుంచి ప్రారంభం కానుండగా ఈ ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరలు కావడం గమనార్హం.

    వడ్డీ రేట్లు, డౌన్ పేమెంట్, లోన్ టెన్యూర్ ఆధారంగా లోన్ ఈఎంఐ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. కంపెనీ తక్కువ ఈఎంఐకే కారును అందిస్తుండటంతో కస్టమర్లకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. సమీపంలోని షోరూంను సంప్రదించి ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కరోనా విజృంభణ తర్వాత వ్యక్తిగత వాహనాల వినియోగం పెరుగుతుంది.

    కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో ఈ కారు మార్కెట్ లోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.