https://oktelugu.com/

డేంజర్: కరోనాతోపాటే మరో రెండు భీకర వ్యాధులు

జనవరి వరకు మన దేశవాసులకు కరోనా అంటే తెలియదు. ఎక్కడో వూహాన్‌లో పుట్టి ఆయా దేశాలకు విస్తరించిన కరోనా.. మెల్లమెల్లగా ఇండియాలోనూ అడుగుపెట్టింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 90,632 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఆదివారం నాటి బులెటిన్‌ ప్రకారం మొత్తం సంఖ్య 41,13,811కి చేరుకుంది. 1,065 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 70,626కి చేరింది. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరుగుతుండడంతోపాటు కోలుకుంటున్న వారి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2020 / 08:58 AM IST

    carona dengue

    Follow us on

    జనవరి వరకు మన దేశవాసులకు కరోనా అంటే తెలియదు. ఎక్కడో వూహాన్‌లో పుట్టి ఆయా దేశాలకు విస్తరించిన కరోనా.. మెల్లమెల్లగా ఇండియాలోనూ అడుగుపెట్టింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 90,632 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఆదివారం నాటి బులెటిన్‌ ప్రకారం మొత్తం సంఖ్య 41,13,811కి చేరుకుంది. 1,065 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 70,626కి చేరింది. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరుగుతుండడంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే.. కరోనాతో బాధపడుతున్న వారికి, కరోనా నుంచి కోలుకున్న వారికి మరో ముప్పు వస్తోందంటున్నారు వైద్య నిపుణులు.

    Also Read : కరోనా కల్లోలం.. ఇప్పట్లో వదిలేలా లేదు కదా..!

    ప్రస్తుతం కరోనా వచ్చిన వారిలో బ్రీతింగ్‌ సమస్య ఉన్నవారికి హాస్పిటల్స్‌లో.. నార్మల్‌గా ఉన్న వారికి హోం ఐసోలేషన్‌లోనే ఉంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. 14 రోజుల హోం క్వారంటైన్‌ పెట్టగా.. చాలా మంది కోలుకొని వారం రోజుల్లోనే నార్మల్‌ స్థితికి చేరుకుంటున్నారు. అప్పటికే లోపల ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం కరోనాతో పోరాడలేక తనువు చాలిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చిన యాంటీబాడీస్‌ ఇవ్వడం తప్ప పెద్దగా వేరే ట్రీట్‌మెంట్‌ ఏమీ లేదు.

    కరోనా రాకుండా నిత్యం జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌లో పరిస్థితులు పాజిటివ్‌గానే ఉన్నా.. అన్‌లాక్‌ మొదలైన నాటి నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రభుత్వాలూ చేతులెత్తేశాయి. ఇప్పట్లో ఈ కరోనా ముప్పు తొలిగేలా కూడా లేదు. అయితే.. ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న వారికి, కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నయని ఢిల్లీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. రోగులను మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్‌ వ్యాధులు కూడా అటాక్‌ చేస్తున్నాయని చెబుతున్నారు.

    కరోనాతో చేరిన వారిలో చాలా మందిలో సీజనల్‌ వ్యాధుల లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లకు విస్తు పోయే రిజల్ట్స్‌ తెలిశాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తికి డెంగ్యూ పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్‌ అని నిర్ధారణ అయిందంట. మరో యువకుడికి కరోనాతోపాటు మలేరియా కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అంటే ఒకే వ్యక్తికి రెండు వేర్వేలు వ్యాధులు సోకడంతో చికిత్స విషయంలో డాక్టర్లు అయోమయంలో పడుతున్నారు. ఇప్పుడు దేనికి ఏ మందు ఇవ్వాలని తెలియక సతమతం అవుతున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌‌ ప్రగ్యాన్‌ ఆచార్య తెలిపాడు. అయితే.. కరోనా వచ్చిన అందరికీ డెంగ్యూ, మలేరియా వస్తుందని ఖచ్చితంగా కూడా చెప్పలేమని ఓ సీనియర్‌‌ డాక్టర్‌‌ అన్నాడు.

    Also Read : పిల్లల జ్ఞాపకశక్తికి ఆవుపాలు/గేదె పాలు..? ఏవీ మంచివి.?