Telugu News » Health » After watching this if you eat chicken in hyderabad your job is doomed shocking video
Chicken in Hyderabad: ఇది చూశాక హైదరాబాద్ లో చికెన్ తింటే మీ పని ఖతమే.. షాకింగ్ వీడియో
కరోనా తరువాత చాలా మంది నిత్యం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరికొందరికి వయసుతో సంబంధం లేకుండా దీర్ఘ కాలిక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే గుండె పోటులు వస్తున్నాయి. అయితే ఈ వ్యాధులకు కారణం నాణ్యమైన ఆహారం తీసుకోకపోవడమేనని చాలా మంది వైద్యులు తెలుపుతున్నారు
Chicken in Hyderabad: కరోనా తరువాత చాలా మంది నిత్యం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరికొందరికి వయసుతో సంబంధం లేకుండా దీర్ఘ కాలిక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే గుండె పోటులు వస్తున్నాయి. అయితే ఈ వ్యాధులకు కారణం నాణ్యమైన ఆహారం తీసుకోకపోవడమేనని చాలా మంది వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొంత మంది ఇంట్లో ఫుడ్ కాకుండా బయట చిరుతిళ్లు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని కొన్ని సంఘటనల వల్ల బయటపడుతుంది. బయట దొరికే చిరుతిళ్లు మాత్రమే కాకుండా కొన్ని మాంసాహార విక్రయాల్లో దొరికే పదార్థాలు కూడా కల్తీగా ఉండడంతో అవి తినడంతో జ్వరాల బారిన పడుతున్నారు. అందుకు ఉదాహరణే తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న సంఘటన. ఓ చికెన్ షాపులో 700 కిలోల కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దీంతో చికెన్ తినే వారు షాక్ కు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
మాంసాహార విక్రయాల్లో చికెన్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. తక్కువ ధరకే ఎక్కువ ప్రోటీన్లు కలిగిన ఈ మాంసాహార విక్రయాలను కొనేందుకు జనం ఎగబడుతారు. అయితే కొన్ని కారణాల వల్ల చికెన్ ధరలు అప్పుడప్పడు పెరుగుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో వీటి అమ్మకాలు తగ్గినా.. మళ్లీ ధర తగ్గడంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. అయితే మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే చికెన్ ఇస్తానంటే ఎవరైనా తీసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ ఇది నాన్యమైనదా? కాదా? అని ఆలోచించేవారు తక్కువ. కానీ కొందరు దీనిని గమనించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది.
హైదరాబాద్ కు చెందిన బాలయ్య అనే వ్యక్తి చికెన్ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. ఈయనకు చెందిన చికెన్ షాపఉ బేగంపేట లోని ప్రకాశ్ నగర్ లో ఉంది. ఇక్కడ చాల తక్కువ ధరకే చికెన్ దొరుకుతుందని పేరు వచ్చింది. కిలో చికెన్ రూ. 30 నుంచి రూ. 50 వరకే విక్రయిస్తాడని స్థానికులు చెప్పారు. అయితే కొంత మందికి అనుమానం వచ్చి అధికారులు ఫిర్యాదు చేయగా.. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి పరిశీలించారు. దీంతో వారికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. ఈ చికెన్ షాపులో మొత్తం 700 కిలోల కుళ్లిన చికెన్ ను కనుగొన్నారు. ఈ చికెన్ మొత్తం నీరు కారుతూ ఉంది.
దీంతో బాలయ్య అనే వ్యక్తితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలయ్య గతంలోనూ కంటోన్మెంట్ ప్రాంతంలోని రసూప్ పురలో నిర్వహించాడు. అయితే అక్కడ స్థానికులు ఇదే సమస్య ఎదుర్కోవడంతో షాపు మూయించేశారు. దీంతో తన మకాంను ప్రకాశ్ నగర్ కు మార్చాడు. ఇప్పడు అతని బండారం బట్టబయలు అయింది. చెన్నై, ముంబయ్ వంటి కేంద్రాల నుంచి కుళ్లిన మాంసాన్ని ఇక్కడికి తీసుకువచ్చి రెస్టారెంట్లు, బార్లకు విక్రయిస్తారని పోలీసులు తెలిపారు. నామమాత్రపు ధరకు దిగుమతి చేసుకొని తక్కువ ధరకే అందిస్తుంటాడు. రెస్టారెంట్లకు, బార్లకు రూ.30 నుంచి రూ.50తో విక్రయిస్తాడు. అయితే కొంతమంది దీనిని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు.