https://oktelugu.com/

Whiskey: విస్కీలో మినరల్ వాటర్ కలుపుతున్నారా? అయితే అంతే సంగతులు

చాలా మంది మద్యం ప్రియులు విస్కీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా మంది రిఫ్రెష్ రుచి కోసం కొంతమంది విస్కీని మినరల్ వాటర్ తో కలపుకొని మరీ తాగుతుంటారు. దీంతో విస్కీ రుచిని పెరుగుతుందట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 7, 2024 / 04:19 AM IST

    Whiskey

    Follow us on

    Whiskey: మందు బాబులం మేము మందు బాబులం మందు తాగితే మాకు మేమే మహారాజులం ఈ పాట వినే ఉంటారు కదా. మందంటే వారికి ఫుల్ చిందు. మందంటే వారికి ఫుల్ కిక్కు. అబ్బో మందు గురించి చెప్పుకుంటూ పోతే పదాలే చాలవు కావచ్చు. ఆ రేంజ్ లో లైక్ చేస్తారు మందు బాబులు మందును. అందులో ఉండే బ్రాండ్స్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బ్రాండ్స్ ఉంటాయి. తాగితే తరగవు కావచ్చు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఈ మందులో. మరి మీకు విస్కీ గురించి తెలుసా? మీలో డ్రింకర్స్ ఉంటే కచ్చితంగా విస్కీ గురించి తెలిసే ఉంటుంది. దాని గురించి తెలియని మందుబాబులు ఉంటారా? కదా. అయితే ఇందులో వాటర్ కలుపుకొని తాగుతున్నారా? మరి ఇలా తాగవచ్చా? లేదా? అయినా మందు తాగడమే తప్పంటే అందులో వాటర్ కలుపుకొని, కలుపుకోకుండా ఏంటి అనుకుంటున్నారా? తప్పదు కదా. మరి చదివేసేయండి విస్కీలో వాటర్ కలపాలా? వద్దా? అనేది.

    చాలా మంది మద్యం ప్రియులు విస్కీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా మంది రిఫ్రెష్ రుచి కోసం కొంతమంది విస్కీని మినరల్ వాటర్ తో కలపుకొని మరీ తాగుతుంటారు. దీంతో విస్కీ రుచిని పెరుగుతుందట. కానీ ఆరోగ్యానికి మాత్రం ప్రమాదమే అంటున్నారు వైద్యులు. అయితే విస్కీ తాగినప్పుడు తరచుగా మూత్రవిసర్జన చేస్తారు. అందులో మినరల్ వాటర్ తో కలిపితే ఈ ప్రభావం ఇంకా పెరగే అవకాశం ఉంటుంది. మీరు అదనపు నీటితో హైడ్రేటెడ్ గా ఉండటానికి జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే డిహైడ్రేటెడ్ కు దారితీస్తుంది.

    మినరల్ వాటర్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవి విస్కీతో కలిపినప్పుడు మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు. ఇది కండరాల తిమ్మిరి, అలసటకు దారి తీస్తుంది. అంతేకాదు విస్కీలో మినరల్ వాటర్ కలపడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. విస్కీ తాగినప్పుడు చాలామందికి కడుపులోపల చిరాకు అనిపిస్తుంటుంది. దీన్ని ఎక్కువ తాగితే మరింత ఎక్కువ అనిపిస్తుంటుంది.

    మినరల్ వాటర్ తో కలపడం వల్ల ఈ చికాకు పెరిగి యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. లివర్ శరీరం నుంచి విషాన్ని ఫిల్టర్ చేయడానికి బాధ్యత వహిస్తుంది. విస్కీని మినరల్ వాటర్ తో కలపితే.. కాలేయంపై అదనపు ఒత్తిడి పెరిగి శరీరానికి హానీ చేస్తుంది. విస్కీలో మినరల్ వాటర్ కలుపుకొని ఎక్కువగా సేవిస్తే.. దీర్ఘకాలిక నష్టానికి దారితీస్తుంది.

    మందు వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్యాంక్రియాస్ అనేది శరీరంలో ఇన్సులిన్ ఇతర రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఆల్కహాల్ తాగడం వల్ల ఈ ప్రాంతంలో మంట వస్తుంది. అంతేకాదు క్యాన్సర్‌కు కారణం అవుతుంది. అందుకే మీరు మందు తాగే ముందు కనీసం ఒక్కసారి అయినా మీ ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి ఆలోచించండి.