Health Tips: యంగ్ గా కనిపించాలంటే మీ డైట్ లో ఇవి చేర్చుకోండి చాలు..

ముఖం చూసి వయసు చెప్పడం చాలా మందికి సులభమే. ఎందుకంటే.. వయసు పెరిగే కొద్దీ ముఖంలో చాలా మార్పులు వస్తుంటాయి. దీంతో వయస్సును దాచడం కష్టమే అంటున్నారు బాధితులు. ఇక నిత్యం యవ్వనంగా కనిపించాలంటే కొన్ని పండ్లు తీసుకుంటే చాలు. మీ వయసు తగ్గి మరీ కనిపిస్తుంది. వావ్ వయసు తగ్గి కనిపించడమా అదేలా అని షాక్ అవకండి. జస్ట్ సింపుల్ గా ఈ పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి చాలు.

Written By: Swathi Chilukuri, Updated On : September 6, 2024 1:18 pm

Health Tips(1)

Follow us on

Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ చాలా రకాల మార్పులు వస్తుంటాయి. కొన్నిసార్లు వయసుకు మించిన మార్పులు కూడా వస్తాయి. ఇక చర్మం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. త్వరగా చేంజ్ అవుతుంది. కానీ మనకు మాత్రం ఫుల్ గందరగోళంగా అనిపిస్తుంది. చర్మాన్ని బట్టి కొన్నిసార్లు మన వయసు కూడా చెప్పవచ్చు. వృద్దాప్యం వస్తుంటే చర్మం వదులుగా అవుతుంటుంది. ఇలా వస్తే చాలు టెన్షన్ కూడా ఫ్రీగానే వస్తుంది కదా. కానీ తప్పదు. బిజీ లైఫ్, నో బెటర్ ఫుడ్ అంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు చర్మం నిపుణులు. అదేనండి డెర్మటాలజిస్టులు.

ముఖం చూసి వయసు చెప్పడం చాలా మందికి సులభమే. ఎందుకంటే.. వయసు పెరిగే కొద్దీ ముఖంలో చాలా మార్పులు వస్తుంటాయి. దీంతో వయస్సును దాచడం కష్టమే అంటున్నారు బాధితులు. ఇక నిత్యం యవ్వనంగా కనిపించాలంటే కొన్ని పండ్లు తీసుకుంటే చాలు. మీ వయసు తగ్గి మరీ కనిపిస్తుంది. వావ్ వయసు తగ్గి కనిపించడమా అదేలా అని షాక్ అవకండి. జస్ట్ సింపుల్ గా ఈ పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి చాలు. ఇట్టే మీ సమస్య తీరిపోతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి అంటే?

మధ్య వయస్సులో కూడా చర్మాన్ని బిగుతుగా ఉంచుకోవాలని.. చర్మం వృద్ధాప్యాన్ని కప్పిపుచ్చడానికి చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ప్రజలు. కానీ వీటి కంటే ఆహారంపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల చర్మ అకాల వృద్ధాప్యం నుంచి తప్పించుకోవచ్చు. అయితే మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి. ఇలా చేస్తే మీ చర్మం టైట్ గా ఉంటుంది.

ఇలా తీసుకోవడం వల్ల శరీరం పోషకాల లోపాలతో బాధపడదు. చర్మం స్థితిస్థాపకత వయస్సుతో చెక్కుచెదరకుండా మంచి స్కిన్ మీ సొంతం అవుతుంది. చర్మం వృద్ధాప్యాన్ని నివారించడానికి పండిన బొప్పాయి చాలా హెల్ప్ అవుతుంది. ఈ పండులో విటమిన్లు A, C, E వంటివి ఉంటాయి. పండిన బొప్పాయి తింటే పొట్ట కూడా క్లీన్ అవుతుంది. తినడమే కాకుండా పండిన బొప్పాయిని ముఖానికి రుద్దుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. బత్తాయి, నారింజ, నిమ్మ వంటి పండ్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు.

సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఇవి చర్మానికి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. ఈ రకమైన పండ్లు చర్మ స్థితిస్థాపకతను పెంచి నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. దానిమ్మ కూడా చర్మ పోషణకు సహాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి, చర్మ సమస్యలను తగ్గించడానికి తోడ్పడుతుంది దానిమ్మ. దీన్ని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి యవ్వనంగా తాజాగా కనిపిస్తారు. మరి వీటికి పెద్దగా ఖర్చు అవదు కాబట్టి మీ డైట్ లో చేర్చుకొని యంగ్ గా కనిపించండి.