https://oktelugu.com/

Stains: టైల్స్, గోడల మీద మొండి మరకలా? సులభంగా క్లీన్ చేసుకోవచ్చు..

సాధారణంగా వంటింట్లో వంట చేసేటప్పుడు మరకలు కామన్ గా పడుతుంటాయి. టైల్స్, గోడలపై మరకలు పడి మురికి మురికి అవుతుంటుంది. అయితే వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని ఉన్నా చేయడం మాత్రం కుదరదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 7, 2024 / 05:00 AM IST

    Stains

    Follow us on

    Stains: ఎలాంటి జిడ్డును అయినా తొలగించడం కొన్ని టిప్స్ వాడితే సాధ్యమే కానీ చాలా బద్దకంగా అనిపిస్తుంటుంది కదా. వంటింట్లో అయ్యే జిడ్డును చూస్తే చాలు తెగ టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఓరి దేవుడా దీన్ని ఎలా ఇప్పుడు నేను క్లీన్ చేయాలి అంటూ తలనొప్పి వచ్చేస్తుంటుంది కానీ తప్పుదు. వదిలేస్తే మరింత ఎక్కువ అవుతాయి. ఎలాంటి మరకలను అయినా తొలగించడం కాస్త ఈజీనే. కానీ ఆ ఆయిల్ మరకలు ఉంటాయి బాస్ వామ్మో చచ్చి ఊరుకోవాలి క్లీన్ చేయడానికి. కానీ ఒక ఇల్లాలిగా తప్పదు కదా. క్లీనింగ్ పని మనదే. మరి ఈ మొండి మరకలను ఎలా తొలగించాలి అని టెన్షన్ పడుతున్నారా? డోన్ట్ వర్రీ ఇలా క్లీన్ చేసేయండి సింపుల్ గా తొలిగిపోతాయి. ఇంతకీ అవేంటంటే..?

    సాధారణంగా వంటింట్లో వంట చేసేటప్పుడు మరకలు కామన్ గా పడుతుంటాయి. టైల్స్, గోడలపై మరకలు పడి మురికి మురికి అవుతుంటుంది. అయితే వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని ఉన్నా చేయడం మాత్రం కుదరదు. అప్పుడప్పుడు క్లీన్ చేసినా సరే ఫుల్ గా జిడ్డుగా మారి.. మురికి అస్సలు వదలదు. దీని వల్ల గోడలు, టైల్స్ మురికిగా పాతగా కనిపిస్తుంటాయి. ఈ టిప్స్ పాటిస్తే చాలు మీ గోడలు తెల్లగా తళతళ మెరుస్తుంటాయి.

    మొండి మరకలను వదిలించడంలో లిక్విడ్ డిష్ వాష్ ఫుల్ ఎఫెక్టీవ్‌గా మీకు సహాయం చేస్తుంది. దీన్ని గోరువెచ్చటి నీటిలో కొద్దిగా వేసి బాగా మిక్స్ చేయండి. కిచెన్ టైల్స్, గోడలపై అప్లై చేసి ఓ ఐదు నిమిషాలు అలాగే ఆరనివ్వండి. ఆ తర్వాత స్క్రబ్ చేస్తే సరిపోతుంది గోడలకు టైల్స్ కు పట్టుకున్న జిడ్డు మొత్తం పోతుంది. ఈ మొండి మరకలను తొలగించడంలో నిమ్మరసం సూపర్ గా పనిచేస్తుంది. కొద్దిగా నీటిలో నిమ్మరసం, కొద్దిగా సర్ఫ్ కలిపి టైల్స్, గోడలపై చల్లండి. ఇలా చేయడం వల్ల కొత్తగా కనిపిస్తాయి మీ గొడలు, టైట్స్.

    వెనిగర్ కూడా జిడ్డు మరకలను వదిలిస్తుంది. కిచెన్ టైల్స్ పై పడ్డ మరకలను పోగొట్టడంలో మీకు మంచి ఫ్రెండ్ ఈ వెనిగర్. కొద్దిగా గోరు వెచ్చని నీటిలో వెనిగర్ కలిపి మరకలపై చల్లాలి. ఓ రెండు నిమిషాల తర్వాత స్క్రబ్ చేయండి మొండి మరకలు మొత్తం పోతాయి.

    బేకింగ్ సోడా కూడా టైల్స్‌పై పడ్డ మరకలను తొలగిస్తుంది. చిన్న పాత్రలో వేడి నీళ్లు తీసుకోని.. అందులో బేకింగ్ సోడా కలిపి మొండి మరకలు ఉన్న చోట నీళ్లు వేస్తూ స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల మరకలు పోయి..టైల్స్ కొత్తగా మారుతాయి.

    సోడా: ఇంట్లో టైల్స్ అయినా.. బాత్రూమ్‌లోని టైల్స్‌ అయినా సరే మచ్చలు పడితే దారుణంగా కనిపిస్తాయి కదా. కానీ సోడా సహాయంతో ఈ మరకలను తగ్గించుకోవచ్చు. కొద్దిగా నీటిలో సోడా వేసి స్క్రబ్ చేయండి. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల మురికి త్వరగా వదిలి పోతుంది.

    కూల్ డ్రింక్స్: కూల్ డ్రింక్స్ సహాయంతో కూడా మురికిని తరిమికొట్టొచ్చు. వీటిని ఉపయోగించి కూడా టైల్స్‌పై ఉండే మురికి, మరకలు పోగొట్టవచ్చు. టైల్స్ పై కొద్దిగా కూల్ డ్రింక్స్ వేసి వెంటనే బ్రష్ తో రుద్దితే..మరకలు పోతాయి.