Civilizations : ఒక గొప్ప విషయాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు.. దానికి ముందున్న పరిస్థితులను.. దాని తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకొని చెబుతాం. అప్పుడే అసలు విషయం అర్థమవుతుంది. అంతకు ముందు ఎలా ఉండేదో.. ఆ తర్వాత ఎలా మారిందో అవగతమవుతుంది. ఇప్పుడంటే నాగరిక సమాజం అభివృద్ధి చెందింది కాబట్టి.. మనిషి జీవితం సాఫీగా సాగిపోతుంది. అరచేతిలో విడిపోయే ఫోన్ ద్వారా అన్ని సమకూరుతున్నాయి. మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేది? మనుషులు ఎలా ఉండేవారు? అప్పుడు ఎలాంటి నాగరికతలు ఉన్నాయి? ఆ నాగరికతలో మనిషి జీవనాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.
మెసొపొటేమియా
ఈ కాలమే నాగరికతకు నాంది పలికింది. మనిషి సంఘజీవిగా మారేందుకు దోహదం చేసింది. ఇరాక్, కువైట్, సిరియా, టర్కీ, ఇరాన్ ప్రాంతాల్లో ఈ నాగరికత విలసిల్లింది అని చెప్పడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు లభించాయి. ఈ ప్రాంతాలలో సుమేర్, అక్కద్, బాబిలోనియా, అస్సిరియా వంటి సమూహాలు ఈ కాలంలో అభివృద్ధి చెందాయని చరిత్రకారుల పరిశోధనలో తేలింది.
పురాతన ఈజిప్ట్
ఇప్పుడున్న నైలు నది చుట్టూ ఒకప్పుడు మమ్మీల సంస్కృతి విలసిల్లింది. 3000 సంవత్సరాల క్రితం నుంచే ఈ ప్రాంతంలో ఫారో, పిరమిడ్ లు వంటివి ఉండేవి. ఆ కాలంలోనే ఈ స్థాయిలో పిరమిడ్లు నిర్మించారు అంటే మాటలు కాదు. నేటికీ నైలునది పరివాహకంలో తవ్వకాలు జరుపుతుంటే ఏవో ఒక చారిత్రక ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి.
సింధులోయ నాగరికత
ఇది 3,300 నుంచి 1300 BCE సంవత్సరాల కింద ఈ నాగరికత విలసిల్లింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాగరికత విలసిల్లింది అని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లభించాయి. మనిషి మనుగడను తీవ్రంగా ప్రభావితం చేసిన నాగరికతల్లో సింధులోయ నాగరికత అత్యంత ముఖ్యమైనది.. ఇప్పటికీ భారతీయులు చేసే పనుల్లో ఏదో ఒకచోట సింధులోయ నాగరికత ఆనవాళ్లు కనిపిస్తాయి.
పురాతన గ్రీసు
తత్వశాస్త్రం, ప్రజాస్వామ్యం, నాటక రంగం వంటి వాటికి పురాతన గ్రీసు నాగరికతే మూలం. ఇది పాశ్చాత్య ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపింది. ప్రజాస్వామ్యం గురించి 100 ఏళ్ల క్రితం నాడే అప్పటి వారు ఆలోచించారంటే మామూలు విషయం కాదు.
రోమన్ సామ్రాజ్యం
దీని ఆనవాళ్లు ఇటలీ ప్రాంతంలో కనిపిస్తాయి. ఆర్కిటెక్చర్, భాష, కళలు, కట్టడాలు, జీవన వైవిధ్యం, పరిపాలన వంటి అంశాలలో రోమన్ పాలకులు ప్రపంచం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించారు.
గుప్త సామ్రాజ్యం
గుప్తుల కాలంలో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. పరిపాలనకు సంబంధించి గుప్తులు అనేక శాసనాలు రూపొందించారు. నేటికీ గుప్తుల కాలంలో నిర్మించిన ఆలయాలు కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రజల నుంచి శిస్తు విధానం గుప్తుల కాలం నుంచే మొదలైందని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ శిస్తు కాస్త ఇప్పుడు పన్ను గా మారిందని అంటుంటారు.
ఇస్లామిక్ నాగరికత
ఏడవ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఇస్లామిక్ నాగరికత విలసిల్లింది. ఆసియా మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో ఈ ఇస్లామిక్ నాగరికత విలసిల్లింది. నిర్మాణరంగం, పరిపాలన వంటి విషయాలలో ఇది ప్రపంచం మీద పెను ప్రభావాన్ని చూపింది.
చైనీస్ నాగరికత
చైనీస్ నాగరికతకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. చైనా గోడ నిర్మాణం ఆనాటి రాజుల కాలంలోనే జరిగింది. నాగరిక సమాజానికి కాగితాన్ని పరిచయం చేసింది చైనా రాజులే.. తత్వశాస్త్రం, సామాజిక ఉన్నతి, సంగీతం, కళలు వంటి విషయాలలో చైనా నాగరికత ప్రపంచానికే పాఠాలు బోధించింది.
మాయన్ నాగరికత
దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.. ఇప్పుడు మనం చూస్తున్న క్యాలెండర్.. వాస్తు శిల్పాలు.. అధునాతన రచన విధానం ఆ కాలంలోనే ఆచరించే వారంటే నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. ఈ నాగరికత ప్రస్తుత మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్ ప్రాంతాలలో విలసిల్లింది అని చెప్పడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు లభించాయి.
ఇంకాన్ సామ్రాజ్యం
ఇంకాన్ సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి చరిత్రకారుల వద్ద స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఇది కూడా వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉందని చెబుతారు. పెరూ, బొలివియా, ఈక్వడార్, చిలి, అర్జెంటీనా, అండీస్ పర్వతాలలో ఈ నాగరికత విలసిల్లింది అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు లభించాయి. రాతి పని, వ్యవసాయం, సామూహిక జీవనం వంటివి ఈ కాలంలో విలసిల్లాయి.