HMPV Virus : దేశంలో మరోమారు హెచ్‌ఎంపీవీ విస్తరిస్తోంది. చాపకింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. మారుతన్న వాతావరణ పరిస్థితులు వైరస్‌కు అనుకూలంగా మారుతున్నాయి. దీంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జనవరి 28న అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. దీంతో బాలుడిని ఎన్టీవీసీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు చేశారు. దీంతో బాలుడికి హెచ్‌ఎంపీవీ సోకినట్లునిర్ధారణ అయింది. బాలుడు ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చాడని తెలిపారు. ప్రస్తుతం ఆలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
8 కేసులు..
ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో ఇప్పటి వరకు 8 కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఏడు, సబత్కారం జిల్లాలో ఒక కేసుల వెలుగు చూశాయి. అహ్మదాబాద్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వారు పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి వపంపించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు హెచ్‌ఎంపీ కేసులు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లో 8, మహారాష్ట్రలో 3, కర్నాటకలో 2, తమిళనాడులో 2, అసోంలో ఒక ఏసు నమోదైంది.
చైనాలో గుర్తింపు..
హెచ్‌ఎంపీవీ వైరస్‌ను 2001లో హ్యూమన్ మెటానిమో వైరస్(HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. ఇది ఒక రెస్పిరేటరీ సిన్సిటీయల్ వైరస్ (RSV)తోపాటు న్యూమోవిరిడే ఫ్యామిలీకి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. అనారోగ్య తీవ్రతను బట్టి వ్యాధివ్రత,్యధిఙారవచ్చు. సాధారణంగా ఈ వైరస్ పొదిగే ఏడాది కాలంగా 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్‌ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిప్స్ లేదా న్యూమోనియాకు దారితీస్తాయి. దిగువ, ఎగువ శ్వాస ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యేరిస్థితి నెఎలకొంది.
హెచ్‌ఎంపీవీ లక్షణాలు
హెచ్‌ఎంపీవీ వైరస్ సోకితే శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్లు, న్యూమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీయవచ్చు. లక్షణలు మరంత పెరిగితే క్రానిక్ అబ్రక్టివ్ పల్నరీ డిసీజ్(COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.