Health Drink : అందంగా ఉండాలని ఎవరికీ ఉండదు. మేని చాయ కలిగి ఉండాలని.. ముఖవర్చసు మెరిసిపోతూ ఉండాలని.. ముడతలు పడకుండా చర్మం నిగనిగలాడుతూ ఉండాలని అందరికీ ఉంటుంది. ఇలా ఉండటానికి చాలామంది కసరత్తులు చేస్తూ ఉంటారు. వివిధ రకాల పండ్ల రసాలు తాగుతూ ఉంటారు. అయినప్పటికీ ఉపయోగం ఉండదు. కొంతమంది డైటీషియన్లను కూడా పెట్టుకుంటారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు. గడిచిపోతున్న కాలాన్ని, తరిగిపోతున్న వయసును, ముడతలు పడే చర్మాన్ని, తగ్గిపోయే అందాన్ని ఎవరూ ఆపలేరు. కానీ ఈ పండ్ల రసాలు తీసుకుంటే మాత్రం కచ్చితంగా ఆపొచ్చు.
స్ట్రాబెరీ
శీతల ప్రాంతాల్లో పండే ఈ పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కేవలం చలికాలంలో మాత్రమే ఈ పండ్లు లభిస్తాయి. వీటిల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రుచికి ఇవి తీపి, పులుపు కలయికతో ఉంటాయి. వీటి రసంలో కొల్లాజన్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ విటమిన్ గా పని చేస్తూ ఉంటుంది. ఇది శరీరంలో ప్రోటీన్ల పెరుగుదలకు సహకరిస్తుంది.
పుదీనా రసం
పుదీనా ఆకుల్లో యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే ప్రత్యేకమైన క్లోరోఫిల్ యాంటీ ఏజింగ్ విటమిన్ గా పని చేస్తుంది. పుదీనా రసాన్ని రోజు తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణ మెరుగవుతుంది. అంతేకాదు ఇది శరీరంలో రోగనిరోధక లక్షణాలు పెంపొందించడంలో తోడ్పడుతుంది.
దానిమ్మరసం
దానిమ్మ రసం శరీరంలో రక్త వృద్ధికి తోడ్పడుతుంది. ఈ పండ్ల రసంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్ల రసాన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరం ముడతలు పడకుండా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియను పెంపొందిస్తుంది.. విటమిన్ల సమతుల్యతను కాపాడుతూ ఉంటుంది.
క్యారెట్ జ్యూస్
క్యారెట్ లో కొల్లాజన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ విటమిన్ గా పని చేస్తుంది. చర్మ రక్షణకు సహాయపడుతుంది. చర్మంపై ఏర్పడే నల్లమచ్చలను ఇది నివారిస్తుంది.. జీర్ణ క్రియను కూడా పెంపొందిస్తుంది.
బీట్ రూట్
శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో బీట్ రూట్ రసాన్ని మించింది ఏదీ లేదు. శరీరంలో రక్త వృద్ధిని కూడా ఇది పెంపొందిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అన్నింటికీ మించి ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
నిమ్మకాయ, తేనె, గోరువెచ్చని నీరు
సాధారణంగా నిమ్మరసం అనేది యాంటీ యాక్సిడెంట్ గా పని చేస్తుంది. తేనె కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని రోజు ఉదయం తాగడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఇంకా ఏమైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే వాటి నివారణకు తోడ్పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.
(పైన పేర్కొన్న జ్యూసులను మొత్తం మాకు తెలిసిన సమాచారం మేరకే ఈ కంటెంట్ రూపంలో అందించాం. మీకు ఏమైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేగాని ఆ సమస్యలకు ఈ పండ్ల రసాలు పరిష్కార మార్గాలు కావు)