ఆ గ్రామంలో పురుషులకు నో ఎంట్రీ.. కారణమేంటంటే..?

సాధారణంగా ఏ గ్రామంలోనైనా స్త్రీలు, పురుషులు ఉంటారు. అయితే ఒక గ్రామంలో మాత్రం పురుషులకు ఎంట్రీ లేకుండా స్త్రీలు మాత్రమే జీవనం సాగిస్తున్నారు. తమకు తామే అండ అంటూ కొందరు మహిళలు ప్రత్యేకంగా ఒక గ్రామాన్నే నిర్మించుకున్నారు. గ్రామం ఎంట్రన్స్ లో ఈ గ్రామంలోకి పురుషులకు ప్రవేశం లేదంటూ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇలా నోఎంట్రీ బోర్డు ఉన్న గ్రామం కెన్యా దేశంలో ఉంది. Also Read: ఆ ఆస్పత్రిలో ఫీజు రూపాయి మాత్రమే.. […]

Written By: Navya, Updated On : February 15, 2021 12:00 pm
Follow us on

సాధారణంగా ఏ గ్రామంలోనైనా స్త్రీలు, పురుషులు ఉంటారు. అయితే ఒక గ్రామంలో మాత్రం పురుషులకు ఎంట్రీ లేకుండా స్త్రీలు మాత్రమే జీవనం సాగిస్తున్నారు. తమకు తామే అండ అంటూ కొందరు మహిళలు ప్రత్యేకంగా ఒక గ్రామాన్నే నిర్మించుకున్నారు. గ్రామం ఎంట్రన్స్ లో ఈ గ్రామంలోకి పురుషులకు ప్రవేశం లేదంటూ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇలా నోఎంట్రీ బోర్డు ఉన్న గ్రామం కెన్యా దేశంలో ఉంది.

Also Read: ఆ ఆస్పత్రిలో ఫీజు రూపాయి మాత్రమే.. ఎక్కడంటే..?

కెన్యా దేశంలో నివశించే సంబుర జాతికి చెందిన తెగలో పురుషులు ఎక్కువగా ఉన్నారు. ఈ తెగలోని పురుషులు స్త్రీలు కేవలం పిల్లలను కనడానికి మాత్రమే పనికొస్తారని భావనను కలిగి ఉండటంతో పాటు బలవంతపు వివాహాలు, గృహహింసకు పాల్పడ్డారు. ఆ గ్రామంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల వల్ల అక్కడి మహిళల జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక ప్రత్యేక గ్రామం ఏర్పాటుకు ఈ ఘటన కారణమైంది.

Also Read: ఆ.. చీకటిరోజుకు రెండేళ్లు..

ముప్పై సంవత్సరాల క్రితం కౌంటీలోని ఉమోజా ఉసో గ్రామంలో సంబురు తెగకు చెందిన మహిళలు గుడిసెలను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. గడ్డి, మట్టి, ఆవు పేడ, కట్టెలతో కుటీరాలను నిర్మించుకొని గుడిసెల చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకునారు. 50 మంది మహిళలు ఈ గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామంలోని మహిళలకు అబ్బాయిలంటే వారు తల్లుల దగ్గర 18 సంవత్సరాల వరకు పెరగవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

సంబురు తెగకు చెందిన 1400 మంది మహిళలపై 30 సంవత్సరాల క్రితం సైనికులు అత్యాచారం చేయడంతో బాధితులను వారి భర్తలు ఇంట్లో నుంచి గెంటేశారు. ఆ తరువాత మహిళలు ఉమెజా పేరుతో గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని సంప్రదాయ వస్తువులు, ఆభరణాలు తయారు చేసి జీవనోపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పురుషులకు ప్రవేశం లేదని మహిళలు స్పష్టంగా చెబుతున్నారు.