Vegetables and Fruits : కుక్కలంటే నచ్చని వారు ఎవరు ఉంటారు. వాటిని ద్వేషించేవారి కంటే ప్రేమించే వారే ఎక్కువ ఉన్నారు. ఇక కుక్కలను చాలా మంది ఇట్లో పెంచుకుంటారు. మనుషుల కంటే కూడా వీటికి ఎక్కువ ప్రేమిస్తారు. వాటికి ఏదైనా జరిగితే చాలా బాధ పడతారు. వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. ఇక వాటికి పెట్టే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. మరి మీరు కూడా కుక్కలను ఇష్టపడే వారిలో ఒకరా? అయితే బిస్కెట్లు మాత్రమే పెట్టి వాటిని విసిగిస్తున్నారా? ఈ ఫ్రూట్స్, కూరగాయలు కూడా పెట్టండి. వీటి వల్ల మీ కుక్కలకు మంచి ఆరోగ్యం అందుతుంది. సో మర్చిపోకుండా వాటిని పెట్టడం వల్ల వాటి ఆరోగ్యంతో పాటు వాటికి కాస్త భిన్నమైన ఆహారం కూడా పెట్టినట్టు అవుతుంది. కాస్త టేస్ట్ ను ఛేంజ్ చేయండి బాస్.
అరటిపండును ఇష్టపడే వారు ఎక్కువ. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇష్టంగానే తింటారు. అయితే ఇందులో పొటాషియం, విటమిన్ సి, డైట్రే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ అరటి మీ కుక్కలకు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మాత్రమే కాదు వాటికి కూడా పెట్టండి. మంచి ఫలితాలు వస్తాయి. గ్రీన్ బీన్స్ కూడా పెట్టవచ్చు. కుక్కలు పచ్చి బఠానీలను ఇష్టపడతాయి అని మీకు తెలుసా? నిజమే అవి వాటిని చాలా ఇష్టపడతాయి. కానీ మరీ ఎక్కువగా పెట్టకుండా కాస్త తక్కువ పెట్టండి.
పుచ్చకాయను కూడా మీ కుక్కలకు ఆహారంగా అందించవచ్చు. వాటర్ కంటెంట్, విటమిన్ ఎ, సి అధికంగా ఉండే పుచ్చకాయను కుక్కలు ఖచ్చితంగా ఇష్టపడతాయి. ఇక పాలకూర కూడా వాటికి పెట్టవచ్చు. బచ్చలికూర ఫైబర్ కు గొప్ప మూలం. విటమిన్లు, ఖనిజాలు మీ కుక్క శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీ లు కూడా చాలా మంచివి. మీ కుక్క ఆహారంలో బ్లూబెర్రీస్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌తో లోడ్ చేసి ఉంటాయి. వాటి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
గుమ్మడికాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. మీ కుక్క ఆహారంలో ఇది అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. స్ట్రాబెర్రీలు కుక్కలకు రుచికరమైన, పోషకమైన చిరుతిండి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది వాటి ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాపిల్స్ విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. బ్రోకలీని చిరుతిండిగా లేదా మీ పెంపుడు జంతువు సమతుల్య ఆహారం కోసం సైడ్ డిష్‌గా ఉపయోగించండి. చిలకడదుంపలలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఆంథోసైనిన్‌లు అధికంగా ఉంటుంది. ఇవి మీ కుక్క ఆహారంలో తరచుగా ఉండేలా చూసుకోవాలి.