రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పండ్లలో సపోటా ఒకటనే సంగతి తెలిసిందే. ఎక్కువగా తీపి ఉన్న పండ్లలో ఒకటైన సపోటా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. సపోటా పండ్లలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. ఎనర్జిటిక్ ఫ్రూట్ అయిన సపోటా అలసటతో బాధ పడుతున్న వారికి అలసటను తగ్గించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ పండ్లలో ఎ, సి విటమిన్లు ఉండగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎ, సి విటమిన్లు సహాయపడతాయి.
Also Read: తక్కువ బరువు ఉన్నవారికి షుగర్ వస్తుందా.. నిపుణులు ఏం చెప్పారంటే..?
కళ్లకు మంచి చేయడంలో సహాయపడే ఈ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి గుండె సంరక్షణకు తోడ్పడతాయి. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు ఈ పండ్లు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఫైబర్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే సపోటాలు క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి.
Also Read: చుండ్రు సమస్యకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే..?
అధిక వేడి సమస్యతో బాధ పడేవాళ్లు సపోటాలను తీసుకుంటే శరీరంలో వేడి తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సపోటాలు సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలు సపోటా పండ్లను తీసుకుంటే కడుపులో కలిగే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ రోజుకు రెండు సపోటాలు తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
సపోటా పండ్లలో ఉండే మెగ్నీషియం రక్త నాళాలను చురుకుగా ఉండేలా చేయడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లు సపోటాలు తీసుకుంటే మంచిది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉండే సపోటాలను షుగర్ పేషెంట్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదు.