ఉదయ్ శంకర్, జియా శర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘క్షణక్షణం’. కార్తిక్ మేడికొండ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మన మూవీస్ బ్యానర్ పై వర్లు-చంద్రమౌళి నిర్మించారు. ఈ చిత్రానికి కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందించాడు. గీతా ఫిలింస్ రిలీజ్ చేస్తోంది. ఫిబ్రవరి 26న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
Also Read: పవర్ ఫుల్ కాంబో.. పవన్ తో పూరీ ఫిక్స్?
అంతా కొత్త నటీనటులు, కొత్త దర్శకుడు కలిసి చేసిన చిత్రం ‘క్షణక్షణం’. భార్యపై ప్రేమ.. రోమాంటిక్.. సంపాదన కోసం పరుగులు తీయడంలో ఎదురైన ఇబ్బందుల చుట్టూ సినిమా కథ నడిచినట్టు ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే హీరో ఓ చిక్కుల్లో పడడం.. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక.. సంగీత దర్శకుడు కోటిని అడిగిన విధానం గురించి అందులో చూపించారు.
Also Read: మా నిశ్చితార్థం మీడియానే చేసింది.. సింగర్ సునీతారామ్
ట్రైలర్ లో కథ ఏంటనేది సస్పెన్స్ మెయింటేన్ చేశారు. ట్రైలర్ ను ఆసక్తికరంగా రూపొందించారు. విడుదలయ్యాక చిత్రం ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.