https://oktelugu.com/

తెలంగాణపై బీజేపీకి విశ్వాసం ఎందుకు పెరుగుతోంది?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో గండరగండరుడు లాంటి వాడు. అపర చాణక్య తెలివితేటలు గలవారు. ఆయనను ఎదుర్కొనే నిలిచే ప్రతిపక్షం ప్రస్తుతం తెలంగాణలో కనిపించడం లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబే.. కేసీఆర్ ను ఎదుర్కోలేక అప్పట్లో అమరావతికి మకాం మార్చేశాడు. ఇక తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను బలహీనం చేయడంలో కేసీఆర్ కీరోల్ పోషించారు. ఇప్పుడు తనకు ఎదురే లేదనుకుంటున్న సమయంలో తెరపైకి వచ్చిన యువ ఎంపీలతో బీజేపీ బలోపేతమైంది. కరీంనగర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 14, 2020 / 03:25 PM IST
    Follow us on


    తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో గండరగండరుడు లాంటి వాడు. అపర చాణక్య తెలివితేటలు గలవారు. ఆయనను ఎదుర్కొనే నిలిచే ప్రతిపక్షం ప్రస్తుతం తెలంగాణలో కనిపించడం లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబే.. కేసీఆర్ ను ఎదుర్కోలేక అప్పట్లో అమరావతికి మకాం మార్చేశాడు. ఇక తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను బలహీనం చేయడంలో కేసీఆర్ కీరోల్ పోషించారు. ఇప్పుడు తనకు ఎదురే లేదనుకుంటున్న సమయంలో తెరపైకి వచ్చిన యువ ఎంపీలతో బీజేపీ బలోపేతమైంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టడంతో టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటోంది.

    టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పార్టీని నిలబెట్టడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కొత్త పోరాటాలు.. తెలంగాణ అంతటా నిరసనలు పాలక టీఆర్ఎస్ ను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. తిరుపతిలో అప్పట్లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ అనుచరులు దాడి చేసినప్పుడు తెలంగాణలో బీజేపీ పెద్దగా నిరసనలే వ్యక్తం చేయలేదు. కానీ నేడు వరంగల్ లో ఒక సాధారణ ఎంపీపై దాడి చేసినందుకు తీవ్రమైన ప్రతిస్పందనను బీజేపీ నాయకులు వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి ఈ స్థాయిలో ప్రతీకారం వస్తుందని టీఆర్ఎస్ అస్సలు ఊహించలేదు. దీనంతటికి కారణంగా నాయకత్వ మార్పునే అని అంటున్నారు.

    తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

    వరంగల్ లో బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడికి బీజేపీ సీరియస్ అయ్యింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇది టీఆర్ఎస్ పై ఒక యుద్ధం లాగానే బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారు. దీన్ని తెలంగాణలో బీజేపీ మారుతున్నట్టు అర్థమవుతోంది.

    తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. యువ కార్యకర్తలంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా బండి సంజయ్ అన్ని జిల్లాల్లోని పార్టీ నేతలు, కార్యకర్తలతో వర్చువల్ సమావేశాలను నిర్వహిస్తూ పార్టీని సమాయత్తపరుస్తున్నారు. వర్చువల్ మీటింగ్ లో సగటు బీజేపీ కార్యకర్తల హాజరు లక్షగా ఉంటోంది. ఈ అనూహ్య స్పందన అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి బీజేపీకి ధైర్యం ఇస్తోంది.

    వర్చువల్ సమావేశాలతో బీజేపీ కార్యకర్తలు.. నేతల్లో ఉత్సాహం నింపుతున్న బండి సంజయ్ ఈ వేగాన్ని ఎన్నికల వరకు కొనసాగించగలడా అన్నది వేచిచూడాలి.. గతంలో కూడా ఇదే వేగాన్ని బీజేపీ అందుకుంది.. కానీ కొనసాగించలేకపోయింది.. గతంలో పనిచేసిన కిషన్ రెడ్డి, లక్ష్మన్ లు దూకుడుగా వెళ్లి సైలెంట్ అయ్యారు. సంజయ్ మరి ఈ వేగాన్ని కొనసాగించి బీజేపీని విజయతీరాలకు చేరుస్తారా? లేదా మురిపించి ముగిస్తారా అన్నది వేచి చూడాలి..