https://oktelugu.com/

చిరు ‘ఆచార్య’ ఆఫర్కు సాయి పల్లవి నో!

తెలుగు సూపర్ హిట్‌ డ్యాన్స్‌ షో ‘ఢీ’లో డ్యాన్సర్ గా పార్టిసిపేట్‌ చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సాయి పల్లవి. దక్షిణాదిలో ఇప్పుడామెకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందం లేకపోయినా.. అభినయంతో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుందామె. బోల్డ్‌ క్యారెక్టర్లకు, స్కిన్ షోకు ఎప్పుడూ దూరంగా ఉండే పల్లవి తన ఫస్ట్‌ సినిమా మలయాళ ‘ప్రేమమ్‌’తో యువత హృదయాలు కొల్లగొట్టింది. అక్కడి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ్‌, కన్నడ, తెలుగు చిత్రాలతో బిజీగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 14, 2020 / 03:09 PM IST
    Follow us on


    తెలుగు సూపర్ హిట్‌ డ్యాన్స్‌ షో ‘ఢీ’లో డ్యాన్సర్ గా పార్టిసిపేట్‌ చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సాయి పల్లవి. దక్షిణాదిలో ఇప్పుడామెకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందం లేకపోయినా.. అభినయంతో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుందామె. బోల్డ్‌ క్యారెక్టర్లకు, స్కిన్ షోకు ఎప్పుడూ దూరంగా ఉండే పల్లవి తన ఫస్ట్‌ సినిమా మలయాళ ‘ప్రేమమ్‌’తో యువత హృదయాలు కొల్లగొట్టింది. అక్కడి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ్‌, కన్నడ, తెలుగు చిత్రాలతో బిజీగా మారిందామె. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వరుణ్ తేజ్‌ సరసన ‘ఫిదా’తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైందామె. ‘భానుమతి సింగిల్‌ పీస్‌’ అంటూ తెలంగాణ పల్లెటూరి యువతిగా చేసిన ఆ పాత్ర ఆమె కెరీర్లో ఓ మైలురాయి.

    సాయిపల్లవికి మరో సర్ ప్రైజ్..

    అయితే, ఎప్పుడూ భిన్నమైన పాత్రల కోసం ఆరాటపడే సాయి పల్లవికి ఫిదా తర్వాత తెలంగాణ అమ్మాయి పాత్రలు చాలా వచ్చినా ఆమె సున్నితంగా తిరస్కరించింది. కానీ, శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో మాత్రం ఆమె మరోసారి తెలంగాణ యువతిగా కనిపించబోతోంది. ఇది ‘ఫిదా’కు భిన్నమైన పాత్రనట. అదే సమయంలో రానా హీరోగా తెరకెక్కుతున్న ‘విరాట పర్వం’లో నక్సలైట్‌గా నటిస్తోందామె. మాజీ నక్సలైట్‌ బెల్లి లలిత జీవితం ఆధారంగా ఆమె పాత్రను డిజైన్‌ చేశారన్న ప్రచారం జరిగినా చిత్ర బృందం దాన్ని ఖండించింది. కాగా, విరాట పర్వంలో నక్సలైట్‌ పాత్రలో పల్లవి ఫస్ట్‌ లుక్‌ చూసి ఇంప్రెస్‌ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్ర బృందం నుంచి ఆమెకు ఆఫర్ వచ్చిందట. ‘ఆచార్య’ కూడా నక్సలైట్‌ ఇతివృత్తింలో నడిచే కథ కావడంతో ఓ కీలక పాత్ర కోసం సాయి పల్లవిని అడిగారట. కానీ, ఒకే సారి ఒకే రకమైన రెండు పాత్రలు పోషించడం ఇష్టం లేని సాయి పల్లవి.. చిరు మూవీ ఆఫర్ను రిజెక్ట్‌ చేసినట్టు సమాచారం. లవ్‌స్టోరీ రిలీజ్‌కు రెడీగా ఉండగా.. నానితో మరోసారి సినిమాకు పల్లవి ఓకే చెప్పింది. తమిళ్‌లో విక్రమ్‌ సరసన కూడా ఆఫర్ వచ్చిందట.