spot_img
Homeగెస్ట్ కాలమ్బీజేపీ జాతీయ విద్యావిధానంతో ఎవరికి లాభం?

బీజేపీ జాతీయ విద్యావిధానంతో ఎవరికి లాభం?

New Education Policy 2020

జాతీయ విద్యావిధానం-2020 చట్టం, భారత సమాజం లో ఏదో చాలా గొప్ప మార్పు తీసుకొని వస్తుంది అని కొందరు వాదిస్తున్నారు. కానీ ఈ చట్టం లో చెప్పబడిన అనేక విషయాలు ఎప్పుడో 200 ఏండ్ల కింద అమెరికాలో ప్రవేశ పెట్టబడి, పెట్టుబడిదారీ విధానానికి పట్టుగొమ్మలుగా నిలిచిన విషయాన్ని మనం గమనించ వచ్చు.

Also Read: డేంజర్ వేవ్: దేశంలో పెరిగిపోతున్న యూకే కొత్త కరోనా కేసులు

క్రీ.శ. 1776 లో అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు, స్టేట్ ,ఫెడరల్ ప్రభుత్వాల అధికారాల పంపకం., అక్కడ ఉన్న నల్ల జాతులవారి బానిస విధానానికి వ్యతిరేకంగా జరిగిన సివిల్ వార్ 1861లో మొదలై 1865లో ముగిసింది. ఈ మధ్య కాలం లో యూరప్ లో పారిశ్రామిక విప్లవం మొదటి దశ ప్రారంభింప బడి పారిశ్రామికాధిపతుల వద్ద డబ్బు ప్రోగు పడడం మొదలైంది. అలా ప్రోగుపడ్డ సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ వివిధ పరిశ్రమలల్లో పెట్టుబడులు పెట్టి సరుకు ఉత్పత్తి చేసి మారకం చేయడం ద్వారానే పెట్టుబడి అభివృధ్ధి అవుతుంది అన్న ఆర్థిక సూత్రాల ఆధారంగా పెట్టుబడి దారి విధానం మొదలైంది.అందరికీ చెందవలసిన యూనివర్సల్ సంపద అయిన మౌలిక వనరులు ఖర్చై డబ్బున్న వారి సంపదే పెరుగుతున్నది కదా సామాన్యులమైన మాకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న మొదలైన తర్వాత మీకు పనిజేసుకొనే అవకాశం కల్పిస్తున్నాము కదా అన్న ఊరడింపు, బుజ్జగింపు మాటలు ముందుకు వచ్చాయి.

అధిక సరుకుల ఉత్పత్తి అధిక లాభాలు తెచ్చి పెడుతుందన్న వాదన వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణకు సాంకేతిక నైపుణ్యం అవసరం పడింది. అందుకు శ్రామిక జనాలకు కూడా విద్య అందించ వలసిన అవసరం పడింది. అప్పుడు, అంటే 19 వ శతాబ్దం ప్రారంభం లోనే యూరప్, అమెరికా, పారిశ్రామికీకరణ చెందిన దేశాలల్లో పెద్ద ఎత్తున శ్రామిక జనాలకు విద్య అందించ వలసిన అవసరం ఏర్పడింది. అప్పటివరకూ ఆయా మతగ్రంథాల బోధన వరకే పరిమితమైన చదువులు సాంకేతిక, భౌతిక,రసాయనిక శాస్త్రలను బోధించడం కూడా మొదలుపెట్టక తప్పలేదు. అందుకని ప్రధానంగా అమెరికా లో కామన్ స్కూల్ విధానం 19వ శతాబ్దంలోనే ప్రారంభించబడింది.

ఒక రాజకీయ పార్టీ అధికారం లోకి రావడానికి ప్రజలు పెద్దసంఖ్యలో ఓట్లు వేసి దానిని గెలిపించుకోవాలి. అట్లా అధికారం లోకి వచ్చిన పాలక పార్టీ , పెట్టుబడి దారి వర్గానికి తమ సేవలను అమ్ముకోవడానికి ప్రజలను ఎప్పటికప్పుడూ ఒప్పిస్తూ వారు లాభాలు పెంచుకోవడానికి దోహద పడుతూ ఉండాలి. పాలక పార్టీ ఆ విధంగా దోహద పడనప్పుడు, పెట్టుబడి తమవద్ద ఉన్న సంపద, ప్రచార సాధనాలను ఉపయోగించి దాని స్తానంలో తమకు అనుకూలంగా ఉండే మరో పార్టీని అధికారం లో కూర్చోబెడుతుంది.

1945లో 2వ ప్రపంచ యుద్ధం ముగుసి 1947 లో బ్రిటిషర్ల నుండి భారత్ లోని స్తానిక పాలకుల చేతిలోకే అధికారం బదిలీ అయిన తర్వాత దేశం లో మిశ్రమ ఆర్థిక విధానాలను అమలుపరిచే క్రమంలో విద్యా విధానం ఎలా ఉండాలి అనే దానికి పెద్దగా కస్టపడవలసిన అవసరం లేకుండానే తాము వలసగా ఉన్న ఇంగ్లాండ్ విద్యావిధానాన్నే యథాతథంగా కొనసాగించడానికి పాలకులు నిర్ణయించారు. కానీ యూరప్ లో మాదిరిగా దేశం లో పారిశ్రామికీకరణ జరుగనందున సాంకేతిక విద్య అవసరం అంతగా లేకుండా పోయింది. సామాజిక శాస్త్రాలు, న్యాయ, వైద్య విద్య అవసరాలు ఎక్కువగా ఉండేవి. వైద్య విద్యాలయాల ఏర్పాటు ఖర్చుతో కూడినవి కావడం చేత ప్రభుత్వాలే తమ శక్తి మేరకు చాలా స్వల్పంగా వైద్యవిద్యాలయాలు ఏర్పాటుచేశాయి.

Also Read: ఆదాయపు పన్ను చెల్లించే వారికి అదిరిపోయే శుభవార్త.. ?

ప్రభుత్వాపాలనలో, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలల్లో,, రక్షణ, రెవెన్యూ శాఖల్లో, న్యాయ శాఖలో పనిజేయడానికి పరిమితమైన అవసరాల కోసం తాలూకాకు ఒక పాఠశాల, జిల్లాకు ఒక కాలేజీ, రాష్ట్రానికి ఒకటి లేదా రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. అవన్నీ ప్రభుత్వాల అవసరాలు తీర్చేవిగానే ఉన్నాయి.

ఇప్పుడు మనం చూస్తున్న భారత దేశం 650 సంస్తానాలు, ఇంకా ఒకనాడు 56 రాజ్యాలు గా ఉండేవి. ఇక్కడ ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు భాష, కట్టు బొట్టు, ఆహారం, ఆహార్యం ఎంతో భిన్నంగా ఉంటాయి. హింది, భోజ్పురి, మరాఠీ,బెంగాలీ, రాజస్తానీ, పంజాబీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, మణిపురి, కన్నడం, తమిళం, తెలుగు, మలయాళం, లాంటి లిపి ఉన్నవి ,లేనివి అనేక భాషలు మాట్లాడే ప్రజలున్నారు. వీరందరికి ఆయా స్టానిక పరిస్తితులకు అనుకూలంగా రాష్ట్రాల జాబితాలో విద్య ఉండేది. తర్వాత విద్య , కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి చేర్చ బడింది. సరే మాద్యమాలు ఏవైనా బోధించే విషయాలను చూసినపుడు అవి ప్రభుత్వ ఉద్యోగులు గా లేకుంటే ప్రైవేట్ వారికి సేవలు చేసేడానికి ఉపయోగ పడేవిగానే ఉన్నాయి.

నెహ్రూ, కాలం లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ కోసం అవసరమైన ప్రాజెక్టులు, భాక్రానంగల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ, చంబల్, గండక్ , తుంగభద్రా, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ లాంటి భారీ ప్రాజెక్ట్ ల నిర్మాణం కోసం సివిల్, టెక్నికల్ నిపుణుల అవసరం కొరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల అవసరం ఏర్పడింది. మొత్తంగా ఏ విద్యాసంస్తాలు వచ్చినా అయితే అవి ప్రభుత్వ సేవలకు లేదా ప్రైవేట్ రంగం లో ఉన్న పెట్టుబడిదారుల సేవలకే పరిమితమైనవి దప్పితే మనం మొదటే చెప్పుకున్నట్లుగా సామాన్యులకు పనిజేసుకొని బతికే అవకాశం కలిపించ బడిందే కానీ సమాజం లో ఉన్న ఆర్థిక సామాజిక అంతరాలు తగ్గించడానికి విద్య ఎంతమాత్రం దోహద పడలేదన్నది నిర్వివాదాంశం.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఇక 1991 లో పాముల పర్తి వెంకట నర్సింహా రావ్ ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం అప్పుడప్పుడే ఏర్పాటు చేయబడ్డ నూతన ఆర్థిక , పారిశ్రామిక విధానాలకు దేశంలో తలుపులు బార్లా తెరిచారు. ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల కు రూపకర్త అప్పటి ప్రపంచ బ్యాంక్ చేర్మన్ ఆర్థర్ డంకేల్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్ నేషనల్ మానిటరింగ్ ఫండ్, మరియు ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యం లో Build Sruggle to Stop the Explaitation Of Working People అన్న నినాదం తో ( ఇప్పుడు గదా మధ్య దళారీల నుండి రైతుల దోపిడీని ఆపుతామని సాగు చట్టాలు తెచ్చినట్టు) అమెరికా సూపర్ పవర్ ను ప్రపంచం లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆర్థర్ డంకేల్ , తన డంకేల్ డ్రాఫ్ట్ ను ప్రపంచం ముందుకు తెచ్చి అలిమిన్నో, బలిమిన్నో భారత్ ను ఒప్పించారు. అట్లా ఇక్కడ అమెరికా అవసరాలు నెరవేర్చడానికి విద్యా రంగం లో మార్పులు తీసుకొని రాబడ్డాయి..

నిజానికి విద్య మానవుల జీవితాల్లో అభివృధ్ధికరమైన మార్పు తేవడానికి చాలా బలమైన సాధనం, కానీ అది ఇంతవరదాక పాలక వర్గాల ద్వారా పెట్టుబడికి ఊడిగం చేయడానికే పనికి వచ్చింది గాని సామాన్యుల బతుకుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పుతేవడం లో పెద్దగా దోహద పడలేదు అన్నది గత 250 సంవస్తారాల చరిత్ర చెబుతున్నది. ఇప్పుడు బీజేపీ తీసుకొస్తున్న కొత్త జాతీయ విద్యావిధానం కూడా కార్పొరేట్లు, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికేనన్న విమర్శలు విద్యావేత్తలనుంచి వ్యక్తమవుతున్నాయి. మానవులలో అభివృద్ధికి విద్య ఏమాత్రం దోహదపడడం లేదని తాజా విద్యావిధానం చూసి మేధావులు పెదవి విరుస్తున్నారు.

-వీరగొని పెంటయ్య
విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES
spot_img

Most Popular