https://oktelugu.com/

గెలుపు కోసం పార్టీల పోలిక, చీలిక వ్యూహం!

ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందంటే ఇదే కాబోలు.. తిరుగులేదనుకున్న టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో చేతికిల పడింది. నిజానికి వ్యూహాత్మకంగా పడగొట్టారు.కారును పోలిన చపాతీ రోటీ మేకర్ గుర్తును అదే పొజిషన్ లో వచ్చేలా చేశారు. కారు అనుకొని చాలా మంది పొరపడి చపాతీ రోటీ మేకర్ కు గుద్దారు. దీంతో నాగరాజు అనే స్వతంత్ర్య అభ్యర్థి ఏకంగా 4వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ దుబ్బాకలో రఘునందన్ రావు హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ పై కేవలం 1118 ఓట్ల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 12:49 PM IST
    Follow us on

    ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందంటే ఇదే కాబోలు.. తిరుగులేదనుకున్న టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో చేతికిల పడింది. నిజానికి వ్యూహాత్మకంగా పడగొట్టారు.కారును పోలిన చపాతీ రోటీ మేకర్ గుర్తును అదే పొజిషన్ లో వచ్చేలా చేశారు. కారు అనుకొని చాలా మంది పొరపడి చపాతీ రోటీ మేకర్ కు గుద్దారు. దీంతో నాగరాజు అనే స్వతంత్ర్య అభ్యర్థి ఏకంగా 4వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ దుబ్బాకలో రఘునందన్ రావు హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ పై కేవలం 1118 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒకవేళ చపాతీ రోటీ లేకుంటే ఆ నాలుగు వేల ఓట్లు గులాబీ పార్టీకి పడి ఉంటే ఇప్పుడు టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడిపోయేది కాదు.. డమ్మీ అభ్యర్థులు.. పోలిక గుర్తులు పార్టీలకు పెనుశాపంగా మారాయనడానికి ఇదో పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. మరి ఇలా కీలక గుర్తులను పోలిన గుర్తులు పెట్టడం నిజంగా కుట్రనా? వ్యూహాత్మకమా? డమ్మీ అభ్యర్థులను ఎందుకు పోటీపెడుతారు? అసలు చరిత్రం ఏంటనేది తెలుసుకుందాం..

    Also Read: టీఆర్ఎస్‌ భారీ స్కెచ్‌.. బీజేపీ బయటపడేదెలా..!

    ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు పోలిక, చీలిక వ్యూహం పాటిస్తున్నాయి. బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చీలిక వ్యూహం పాటించి విజయం సాధించింది. లోక్ జనశక్తి పార్టీ ని రంగంలోనికి దించి విజయం సాధించింది. లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులు చీల్చిన ఓట్లతో మహా కుటమిని ఓటమి చెందిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బీజేపీ బీహర్ లో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.

    ఇక ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది. మధ్యలో టీఆర్ఎస్ పుంజుకున్నాప్పటికి 20,21. 22, 23 రౌండ్ లలో లీడింగ్ సాధించడంతో జీజేపీ విజయం సాధించింది. కారును పోలిన గుర్తు (చపాతీ రోలర్)ను ఓ స్వతంత్ర అభ్యర్థికి దుబ్బాక ఎన్నికల్లో కేటాయించారు. ఈ గుర్తే టీఆర్ఎస్ కొంపముంచిదని సొంత పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ప్రజలు కారు గుర్తు అనుకుని చపాతీ రోలర్ కు ఓటు వేసారని టీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు.

    2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తన హెలికాప్టర్ గుర్తుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. అలాగే అత్యంత వ్యూహాత్మకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థి పేరుతో పాటు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కు దగ్గరగా ఉండేలా హెలికాప్టర్ గుర్తును తెచ్చుకున్నారు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను వెతికి పోటికి దించారు. వారికి కొన్ని ఓట్లుపోలైనా వైసీపీ గెలుపును ఆపలేకపోయాయి.

    Also Read: హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు బూటకమా?

    ఇలాంటి పోలిక వ్యూహంతోనే 2019 తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఓ స్వతంత్ర అభ్యర్థికి 27,973 ఓట్లు వచ్చాయి. ఆయన పేరు పెద్దగా ప్రచారంలో లేదు. కానీ ఆయన గుర్తు రోడ్డు రోలర్. అది టీఆర్ఎస్‌ గుర్తు కారును పోలి ఉండడంతో ఓట్లు వెల్లువలా పడ్డాయి. దీంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. గ్రామల్లో చదువురాని వారు తెలియక వారు అనుకున్న గుర్తుకు కాకుండా వేరే గుర్తుకు ఓటు వేస్తున్నారు. ప్రజలు అభ్యర్థుల కంటే గుర్తులను బట్టి ఓటు వేస్తున్నారు. గ్రామాల్లో అనేక రకాల వ్యక్తులు ఉంటారు. వృద్ధులు, వికలాంగులు చూపు సరిగా లేని వారు ఉండడంతో గుర్తులను సరిగా అంచనా వేయడం లేదు. దీంతో గెలుపు ఖాయం అనుకున్న చోట కొన్ని పార్టీలు ఓటమి చవిస్తున్నాయి.

    ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరో తెలియని వ్యక్తికి భువనగిరిలో 27 వేల ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను 5,200 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అంతకుముందు 2014లో కూడా ఈ సమస్య వచ్చింది. అప్పుడు ఆటో గుర్తుకు ఏకంగా 40 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆ ఆటో గుర్తు అభ్యర్థి ఎవరో కూడా జనాలకు తెలియదు. కారు ఓట్లు అటు పడ్డాయి. నా మెజార్టీ 30వేలకు పడిపోయింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా తీసుకోవాలి” అని అన్నారు ఓడిపోయిన భువనగిరి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య.

    * గుర్తులను ఇలా కేటాయిస్తారు..
    ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీకి శాశ్వత గుర్తు ఇస్తుంది. గుర్తింపు లేని పార్టీకి మాత్రం ఆయా ఎన్నికల్లో వీలును బట్టి ఉమ్మడి గుర్తును కేటాయిస్తుంది. ఒకసారి గుర్తింపు వచ్చాక, ఆ గుర్తును శాశ్వతం చేసుకోవచ్చు ఒకప్పుడు పార్టీలు కోరిన గుర్తును ఎన్నికల సంఘం ఇచ్చేది. కానీ తరువాత ఎన్నికల సంఘం తన పద్ధతి మార్చుకుంది. తమ దగ్గర అందుబాటులో ఉన్న గుర్తుల్లో నుంచి ఒక దాన్ని పార్టీలు ఎంపిక చేసుకోవాలని నిబంధన విధించింది. ఇందుకోసం పార్టీలు మూడు ఆప్షన్లు ఇవ్వాలి. ఆ క్రమంలోనే వైఎస్సార్సీపీ, జనసేన వంటి పార్టీలకు ముందే నిర్ణయించిన గుర్తులు వచ్చాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఎన్నికల సంఘం దగ్గర ప్రస్తుతం 200 వరకూ ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఇందులో సామాన్యులకు అర్థం కాని సీసీ కెమెరాలు, పెన్ డ్రైవుల వంటి గుర్తులు కూడా ఉండడం విశేషం.