సీఎం జగన్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చూసి ఉలిక్కిపడ్డ కేంద్రం

ఏపీలో ఇప్పుడు పోలవరం చిచ్చు రేపుతోంది. ఇన్నాళ్లు స్నేహం చేసిన బీజేపీ, వైసీపీలు దీని కారణంగా విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్ ఇటీవల సంచలన లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ఏడు పేజీల లేఖలో ప్రస్తావించారు. ఆలస్యమయ్యే కొద్ది ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కీలకమైన విషయాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. Also Read: చేతులు కాలాక ఆకులు.. […]

Written By: NARESH, Updated On : November 12, 2020 10:57 am
Follow us on


ఏపీలో ఇప్పుడు పోలవరం చిచ్చు రేపుతోంది. ఇన్నాళ్లు స్నేహం చేసిన బీజేపీ, వైసీపీలు దీని కారణంగా విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్ ఇటీవల సంచలన లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ఏడు పేజీల లేఖలో ప్రస్తావించారు. ఆలస్యమయ్యే కొద్ది ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కీలకమైన విషయాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు.

Also Read: చేతులు కాలాక ఆకులు.. జగన్ కోసం సోనియా ఇప్పుడు ఆరాటం!

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించక ముందే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఐదువేల కోట్ల మేర ఖర్చు చేసిందని, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో రాష్ట్ర విభజన, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రకటన, అంచనాల సవరణ చోటు చేసుకున్నాయని ప్రధాని మోడీకి రాసిన లేఖలో జగన్‌ గుర్తుచేశారు. మారిన పరిస్ధితుల్లో అంచనా వ్యయం భారీగా పెరిగిందని జగన్ ప్రధానికి తెలిపారు. కేంద్ర జలసంఘం, టెక్నికల్‌ కమిటీ గతంలోనే ఆమోదించిన రూ.55,656 కోట్ల మొత్తాన్ని కేంద్రం ఆమోదించాలని జగన్ కోరారు.జగన్ రాసిన లేఖ జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. పోలవరంపై ఎదురించలేక జగన్ వెనకడుగు వేస్తున్నాడన్న ప్రతిపక్షాల విమర్శలకు ఈ లేఖతో జగన్ చెక్ పెట్టినట్టైంది. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గనని జగన్ మరోసారి నిరూపించినట్టైంది.ఈ పరిణామంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చర్చనీయాంశమైంది.

దాదాపు బ్రిటిష్ కాలం నాటి నుంచే పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని యోచించారు. అయితే ఆ తరువాత వస్తున్న ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో దానికి కార్యరూపం దాల్చడం లేదు. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ను నిర్మించేందకు ఒక రూపం తీసుకొచ్చారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో పోలవరంను నిర్మిస్తున్నామని చెప్పినా ప్రాజెక్టు పూర్తి కాలేదు.

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై సీరియస్ గా తీసుకొన్నారు. 2021 వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సాయం కావాలి. కానీ కేంద్రం మాటిమాటికి మెలికలు పెడుతుండడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలో లేదు.

Also Read: ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయకపోతే దుబ్బాక గతే.. నేతలకు జగన్ హెచ్చరిక?

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని మిగతా 30 శాతం ప్రభుత్వం పూర్తిచేయలేదా..? అని విమర్శిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న కేంద్రం నిధుల విడుదల విషయంలో మెలికలు పెడుతోంది. దీంతో జగన్ పోలవరం కోసం మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

పోలవరం విషయంలో అంచనా వ్యయం రోజురోజుకు పెరుగుతోంది. కేంద్రం మాత్రం 2014 లో వేసిన అంచనా వ్యయాన్ని మాత్రమే భరిస్తానంటోంది. దీంతో జగన్ ఏషియన్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే కేంద్రం గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనికి కేంద్రం సపోర్టు చేస్తుందా..? లేదా..?అనేది చూడాలి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఈ ఎత్తుతో కేంద్రాన్ని డిఫెన్స్ లో పెట్టాలని జగన్ యోచిస్తున్నట్టు తెలిసింది. ఎలాగూ పోలవరం జాతీయప్రాజెక్ట్. కేంద్రమే భరించాలి. కానీ భరించకుండా బీజేపీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పుడు అప్పు తెచ్చి అయినా కడుతానని జగన్ అంటున్నారు. ఏషియన్ బ్యాంక్ నుంచి జగన్ అప్పు తీసుకొని కడితే కేంద్రం సంతకం చేయాలి. అది బీజేపీ సర్కార్ కే అవమానం. తాము డబ్బులు ఇవ్వకున్నా జగన్ కడుతుంటే దానికి ఆమోద ముద్ర వేయాల్సి రావడం కేంద్రంలోని బీజేపీకే ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెడుతోంది. బీజేపీని డిఫెన్స్ లోకి నెడుతోంది. దీనిపై కేంద్రంలోని పెద్ద మరి పోలవరం కు నిధులు ఇస్తారా? లోన్ తీసుకోవడానికి అనుమతిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఈ పరిణామంతో సీఎం కేంద్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. ఇప్పుడు బాల్ ను పూర్తిగా కేంద్రం కోర్టులోకి నెట్టి జగన్ సేఫ్ సైడ్ లో ఉన్నారు. ఏదిఏమైనా కేంద్రానికే అపవాదు. సీఎం జగన్ ఈ ప్లాన్ తో కేంద్రాన్ని కాస్త గట్టిగానే దెబ్బేశారని విశ్లేషకులు చెబుతున్నారు.