https://oktelugu.com/

విశాఖ రాజధాని: కీలక విజయాన్ని సాధించిన సీఎం జగన్

విశాఖ అంటేనే కూల్‌ సిటీ. అక్కడికి వెళ్లాలని ఎవరికైనా ఉంటుంది. పైగా హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద మెగా సిటీ కూడా. ఇక అక్కడ జాబ్‌ వస్తే మాత్రం ఎవరు కాదంటారు. హ్యాపీగా వెళ్లి జాయిన్‌ అవుతారు. రోడ్, రైల్, ఎయిర్, సీ కనెక్టివిటీ ఉన్న విశాఖలో కొలువు చేయడం అంటే ఎవరైనా ఇట్టే గంతేస్తారు. జగన్ కూడా ఇలాంటి వీక్ నెస్ గమనించే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నారు. మూడు రాజధానుల విషయంలో చట్టం అయి నాలుగు […]

Written By: NARESH, Updated On : November 12, 2020 11:03 am
Follow us on

CM Jagan AP Ca[ital

విశాఖ అంటేనే కూల్‌ సిటీ. అక్కడికి వెళ్లాలని ఎవరికైనా ఉంటుంది. పైగా హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద మెగా సిటీ కూడా. ఇక అక్కడ జాబ్‌ వస్తే మాత్రం ఎవరు కాదంటారు. హ్యాపీగా వెళ్లి జాయిన్‌ అవుతారు. రోడ్, రైల్, ఎయిర్, సీ కనెక్టివిటీ ఉన్న విశాఖలో కొలువు చేయడం అంటే ఎవరైనా ఇట్టే గంతేస్తారు. జగన్ కూడా ఇలాంటి వీక్ నెస్ గమనించే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నారు. మూడు రాజధానుల విషయంలో చట్టం అయి నాలుగు నెలలైనా న్యాయ‌పరమైన వివాదాల్లో చిక్కుకోవడంతో విశాఖకు రాజధాని రాక ఆలస్యం అవుతోంది.

Also Read: సీఎం జగన్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చూసి ఉలిక్కిపడ్డ కేంద్రం

మరోవైపు.. విశాఖలో పాలనా రాజధాని కనుక ఏర్పాటు చేస్తే తాము కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఏపీ ఎన్టీవోలు కూడా హామీ ఇచ్చారట. ప్రభుత్వం ఎప్పుడు రమ్మంటే అప్పుడు విశాఖకు రావడానికి రెడీ అని కూడా భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం పాలనా పరమైన వికేంద్రీకరణకు తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తామని సంఘం ప్రెసిడెంట్ చంద్రశేఖరరెడ్డి చెబుతున్నారు. ఏపీలో ఉద్యోగులు ప్రజల కోసం ప్రభుత్వాలు తీసుకునే మంచి నిర్ణయాలకు ఎప్పుడూ అండగా ఉంటారని కూడా చెప్పారు.

ఇప్పటికే మెట్రో రీజనల్‌ ఆఫీస్‌ను విశాఖకు తరలించిన జగన్‌ సర్కార్‌‌. .మార్చిలో టెండర్లు పిలిచి మెట్రో రైలు పనులను చేపట్టడానికి సిద్దపడుతోంది. 14 కోట్లతో మెట్రో రైలు పనులు మొదటి దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే డిసెంబర్ నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీకి కూడా తాజాగా పచ్చ జెండా ఊపేశారు.

Also Read: చేతులు కాలాక ఆకులు.. జగన్ కోసం సోనియా ఇప్పుడు ఆరాటం!

ఇప్పుడు కేసుల నేపథ్యంలో వచ్చే కొత్త ఏడాదిపైనే జగన్‌ సర్కార్‌‌ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో రోజు వారీ విచారణ జరుగుతుండగా.. తీర్పు అనుకూలంగా వస్తే మరుక్షణమే విశాఖకు పరుగులు తీయడానికి రెడీ అవుతోంది. దానికి సంబంధించిన కసరత్తు అంతా తెర వెనుక వేగంగా జరుగుతోంది. విశాఖలో ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి అందుబాటులో ఉంచుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. మరోవైపు.. ఈ ఏడాది ఉగాదికి విశాఖ రాజధాని శంకుస్థాపన చేద్దామనుకున్నా.. వచ్చే ఏడాది ఉగాదికే ఆ ఆశ నెరవేరనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

విశాఖ రాజధానిని తరలించినా ప్రధానంగా జగన్ వెంట వచ్చేది ప్రభుత్వ ఉద్యోగులే. సచివాలయం, అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా మార్చుతున్న జగన్ కు మద్దతుగా నిలవాల్సింది ఏపీ ఎన్జీవో ఉద్యోగులే. వారే ఇప్పుడు విశాఖ రాజధాని తరలింపునకు ఒప్పుకోవడం.. జగన్ వెంట వచ్చేందుకు అంగీకరించడంతో ఇది సీఎం జగన్ సాధించిన గొప్ప విజయంగా వైసీపీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.