https://oktelugu.com/

దూసుకుపోతున్న రామ్ ‘రెడ్’.. మిగిలిన భాషల్లోకి కూడా !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హట్ కొట్టాడు. అలాగే, రామ్ కొత్త చిత్రం ‘రెడ్’తో కూడా కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న రామ్‌, ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డా.. ‘నేను శైలజా’, ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్ళీ ట్రాక్ ఎక్కి అదే జోష్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన రెడ్ కు మొదటి రోజు […]

Written By:
  • admin
  • , Updated On : January 21, 2021 / 10:42 AM IST
    Follow us on


    ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హట్ కొట్టాడు. అలాగే, రామ్ కొత్త చిత్రం ‘రెడ్’తో కూడా కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న రామ్‌, ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డా.. ‘నేను శైలజా’, ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్ళీ ట్రాక్ ఎక్కి అదే జోష్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన రెడ్ కు మొదటి రోజు నుండి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి అంటే.. రామ్ మార్కెట్ ఎంతలా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

    Also Read: ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక దైర్యం వచ్చిందట !

    అయితే, రెడ్ సినిమా ఇప్పుడు ఏకంగా 7 భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇంతకముందే ప్రకటించి.. రెడ్ కథకు దక్కిన గౌరవాన్ని వారు తెలియజేశారు. కాగా కన్నడ వెర్షన్ ని తెలుగుతో పాటే విడుదల చేశారు కాబట్టి, ఇక ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే మలయాళ డబ్బింగ్ వెర్షన్ జనవరి 22న విడుదల చేయబోతున్నామని ప్రకటించేశారు. అలాగే హిందీ వెర్షన్ ని ఈ నెల చివరి వారంలో రిలీజ్ చేయబోతున్నారు.

    Also Read: ప్రభాస్ పెళ్లి గురించి అడగగానే కృష్ణం రాజు సీరియస్

    ఇక బెంగాలీ – భోజ్ పురి – మరాఠీ బాషల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. మార్చిలో రిలీజ్ చేసేలా డబ్బింగ్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. నిజానికి తెలుగులో ప్లాప్ టాక్ తెచ్చుకున్న రెడ్ కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటే.. అది రామ్ వల్లే అనుకోవాలి. ఏది ఏమైనా ఈ చిత్రంకు వచ్చిన స్పందనకు, వచ్చే కలెక్షన్స్ కు పొంతన లేదు. ఓవరాల్ గా ఊహించిన దానికంటే ఎక్కువగానే కమర్షియల్ హిట్ అయింది ఈ సినిమా.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్