వైసీపీ వైపు క‌ర‌ణం బ‌ల‌రాం!

తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా భావించే పార్టీ శాసనసభ్యులు కారణం బలరామకృష్ణ మూర్తి సహితం అధికార పక్షం వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గత కొద్దీ రోజులుగా వరుసగా పలువురు టిడిపి ప్రముఖ నాయకులు వైసిపిలో చేరుతూ ఉండడం తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడిగా పేరొందిన బలరాం అధికార పక్షంలో చేరే ఆలోచనలలో ఉండటం ప్రధాన ప్రతిపక్షంలో లజడి రేపుతున్నది. తన […]

Written By: Neelambaram, Updated On : March 12, 2020 3:10 pm
Follow us on

తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా భావించే పార్టీ శాసనసభ్యులు కారణం బలరామకృష్ణ మూర్తి సహితం అధికార పక్షం వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గత కొద్దీ రోజులుగా వరుసగా పలువురు టిడిపి ప్రముఖ నాయకులు వైసిపిలో చేరుతూ ఉండడం తెలిసిందే.

అయితే ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడిగా పేరొందిన బలరాం అధికార పక్షంలో చేరే ఆలోచనలలో ఉండటం ప్రధాన ప్రతిపక్షంలో లజడి రేపుతున్నది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మె‌ల్యే గొట్టి‌పాటి ర‌వికుమార్ ను టిడిపిలో చేర్చు‌కున్నప్పటి నుండి బలరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అద్దంకి నుండి కాకుండా చీరాల నుండి పోటీ చేయవలసి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

చీరాల నుండి గెలుపొందినప్పటికీ అంత సంతోషంగా ఉన్నట్లు కనబడటం లేదు. పార్టీ కార్యకలాపాలలో సహితం ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ఆయన లోని అసంతృప్తిని గ్రహించిన ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైసిపి నేతలైన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బా‌రెడ్డి‌ ఇప్పటికే ఆయనతో చ‌ర్చ‌లు జ‌రిపారు.

దానితో ఒకటి, రెండు రోజులల్లో వారిద్దాము ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తో ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సహితం వైసిపిలో చేరడం గమనార్హం.

నాలుగు సార్లు ఎమ్యెల్యేగా, ఒక సారి లోక్‌సభకు బలరాం ఎన్నికయ్యారు. చీరాల నుండి టిడిపికి చెందిన ఎమ్మెల్సీ ఉన్న పోతుల సునీత ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.