గత శనివారం నుండి ఢిల్లీ రావణకాష్టంగా మారడానికి, 1984 తర్వాత ఎన్నడూ ఎరుగని రీతిలో మత ఘర్షణలు చెలరేగడానికి ఢిల్లీ పోలీస్ కమీషనర్ అమూల్య పట్నాయక్ “అసమర్ధత” కారణం అని ఎన్ని విమర్శలు వస్తున్నా అతనిని సమర్ధిస్తూ వస్తున్నా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చిట్టచివరకు ఆయన స్థానంలో ఎస్ ఎన్ శ్రీవాత్సవను ఢిల్లీ కమీషనర్ గా నియమించారు.
అయితే అమూల్య పదవీకాలం ముగిసిన తర్వాత ఆదివారం గాని ఆయన బాధ్యతలు చేపట్టారు. శ్రీవాత్సవ ప్రస్తుతం సి ఆర్ పి ఎఫ్ లో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఢిల్లీలో అల్లర్లు అదుపు తప్పడంతో ప్రత్యేక పోలీస్ కమీషనర్ గా ఢిల్లీకి తీసుకు వచ్చారు.
రెండు నెలలకు పైగా షాహీనభాగ్ లో నిరసనలు చెలరేగుతున్నా, సిఏఏ వ్యతిరేక ప్రదర్శనలు జామామిలియా, జె ఎన్ యు లలో హింసాయుత రూపం దాల్చినా, ఈ సందర్భంగా పోలీస్ ల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చెలరేగినా, తాజా అల్లర్ల సందర్భంగా పోలీసుల ముందే ప్రదర్శనకారులు తుపాకులు పేలుస్తున్నా, కత్తులతో స్వామిరా విహారం చేస్తున్నా నిస్సహాయంగా ఉండిపోయారు.
చివరకు అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సు లపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదు. వీటన్నింటికి కారణం పోలీస్ కమీషనర్ “అసమర్ధత”ఏ కారణంగా అందరు విమర్శలు గుప్పిస్తున్నా ప్రభుత్వం వెనుకవేసుకు వచ్చింది.
వాస్తవానికి అమూల్య పదవీకాలం డిసెంబర్ లోనే ముగిసినా, అమిత్ షా భజనపరులలో ఒకరు కావడంతో, అతని మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించారు. అప్పుడే పలువురు సీనియర్ అధికారులు అసహనం ప్రదర్శించినట్లు తెలిసింది.
కనిపిస్తే కాలపు ఉత్తరువులు ఇచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో వెంటనే పరిస్థితులు అదుపులోకి రాకపోవడం గమనార్హం. రెండు వైపులా ఉత్తర ప్రదేశ్ నుండి అసాంఘిక శక్తులు మారణాయుధాలతో ప్రవేశించి అల్లర్లు సృష్టిస్తున్నా సరిహద్దును మూసివేసే ప్రయత్నం చేయక పోవడం గమనార్హం.