ఢిల్లీ అల్లర్లలో బిజెపిని ఆత్మరక్షణలో పడవేసిన కపిల్ మిశ్రా!

ఢిల్లీలో గత ఐదు రోజులుగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి మాజీ ఎమ్యెల్యే కపిల్ మిశ్రా బిజెపిని ఆత్మరక్షణలో పడవేస్తున్నారు. గత ఆదివారం సిఏఏ అనుకూల ప్రదర్శనకారులను  రెచ్చగొట్టే రీతీలో ప్రదర్శన జరిపి, హింసాయుత సంఘటనకు కారణమయ్యారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ప్రస్తుత అల్లర్లకు అతనే కారకుడని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అతనిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయమని కూడా హై కోర్ట్ ఆదేశించింది. అతని చర్యలతో పార్టీకి సంబంధంలేదన్నట్లు బిజెపి వ్యవహరించింది. అతను జరిపిన ప్రదర్శనతో తమకు సంబంధం […]

Written By: Neelambaram, Updated On : February 28, 2020 1:09 pm
Follow us on

ఢిల్లీలో గత ఐదు రోజులుగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి మాజీ ఎమ్యెల్యే కపిల్ మిశ్రా బిజెపిని ఆత్మరక్షణలో పడవేస్తున్నారు. గత ఆదివారం సిఏఏ అనుకూల ప్రదర్శనకారులను  రెచ్చగొట్టే రీతీలో ప్రదర్శన జరిపి, హింసాయుత సంఘటనకు కారణమయ్యారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ప్రస్తుత అల్లర్లకు అతనే కారకుడని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అతనిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయమని కూడా హై కోర్ట్ ఆదేశించింది.

అతని చర్యలతో పార్టీకి సంబంధంలేదన్నట్లు బిజెపి వ్యవహరించింది. అతను జరిపిన ప్రదర్శనతో తమకు సంబంధం లేదన్నట్లు, పార్టీ ఎటువంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే అతని ఎటువంటి తప్పు చేయలేదని బిజెపి ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు గురువారం వెనుక వేసుకు రావడం బీజేపీలో కూడా కాకారేపుతున్నది. అతని ప్రసంగాలు “రెచ్చగొట్టే విధంగా” లేవని సర్టిఫికెట్ ఇవ్వడం కూడా పలు పార్టీ నేతలు తమాయించుకోలేక పోతున్నారు.

గత ఎన్నికలలో ఆప్ నుండి శాసన సభకు ఎన్నికైన కపిల్ మిశ్రా ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురి కావడంతో ఎన్నికల ముంది బీజేపీలో చేరి, మొన్నటి ఎన్నికలలో ఓటమి చెందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి విద్వేష పూరిత ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అతనిని కట్టడి చేసే ప్రయత్నాలను ఎవ్వరు చేయడం లేదు.

తూర్పు ఢిల్లీ బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ బహిరంగంగానే మిశ్రాకు పార్టీ సీనియర్ నేత ఒకరు `సర్టిఫికెట్’ ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “వ్యక్తి ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కఠినంగా శిక్షింప వలసిందే” అని స్పష్టం చేశారు. మతాల మధ్య రెచ్చగొట్టే మిశ్ర వంటి వారిని పార్టీ ప్రోత్సహించరాదని కూడా ఘాటుగా స్పందించారు.

బిజెపి భాగస్వామ్య పక్షం ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సహితం ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై – ఏ పార్టీ వారైనా తగు చర్య తీసుకోవలసింది అని స్పష్టం సీదేశారు. ఇప్పుడు కపిల్ మిశ్రా గురించి బిజెపి నేతలే జోక్ లు వేస్తున్నారు. ఎన్నికలలో ఆయనకు వచ్చిన ఓట్ల కన్నా సోషల్ మీడియా లో ఆయన ట్వీట్ లకు లీకులు, రీట్వీట్ లు ఎక్కువగా వస్తున్నాయని అంటూ ఎద్దేవా చేస్తున్నారు.