కాంగ్రెస్ కుమ్ములాటలతోనే ఎంపీలో రాజకీయ సంక్షోభం!

మధ్య ప్రదేశ్ లో బొటాబొటి ఆధిక్యతతో నెగ్గుకు వస్తున్న తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి డబ్బు వెదజల్లుతున్నదని అంటూ కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అందుకోసం రూ 100 కోట్లతో ఒక పధకం సిద్ధం చేశారని అంటూ ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అయితే ఆ వీడియో నకిలీదని బిజెపి కొట్టిపారవేసింది. ఇంతలో సుమారు 10 మంది ఎమ్యెల్యేలు కనిపించకుండా పోవడంతో కాంగ్రెస్ లో ఖంగారు బయలుదేరింది. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురితో పాటు, […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 11:41 am
Follow us on

మధ్య ప్రదేశ్ లో బొటాబొటి ఆధిక్యతతో నెగ్గుకు వస్తున్న తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి డబ్బు వెదజల్లుతున్నదని అంటూ కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అందుకోసం రూ 100 కోట్లతో ఒక పధకం సిద్ధం చేశారని అంటూ ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అయితే ఆ వీడియో నకిలీదని బిజెపి కొట్టిపారవేసింది.

ఇంతలో సుమారు 10 మంది ఎమ్యెల్యేలు కనిపించకుండా పోవడంతో కాంగ్రెస్ లో ఖంగారు బయలుదేరింది. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురితో పాటు, మద్దతు ఇస్తున్న ఒకరు స్వతంత్ర, ఒకరు ఎస్పీ, ఇద్దరు బీఎస్పీ సభ్యులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఆరుగురిని ఎమ్మెల్యేలను హరియాణాలోని ఓ హోటల్‌కు, మిగిలిన నలుగురిని బెంగళూరుకు బీజేపీ నేతలు తరలించినట్లు ప్రచారం జరిగింది. వీరిలో ఆరుగురిని కాంగ్రెస్‌ నేతలు తిరిగి రప్పించారు. మిగిలిన నలుగురు కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలో ఓ రిసార్టులో వీరు ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ నేత ఒకరు రెండు చార్టర్డ్‌ విమానాలు అద్దెకు తీసుకుని.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించారని మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు.

అయితే ఇదంతా రాజ్యసభ సీట్ కోసం కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఫలితం అని తెలుస్తున్నది. ప్రస్తుతం ఎంపీ నుండి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండు సీట్లు గెల్చుకొనే అవకాశం ఉన్న కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గంగా పేరొందిన దిగివజాయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా పోటీ పడుతున్నారు.

వారిద్దరూ మొన్నటి లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందగా, దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈ నెలలోని ముగియనున్నది. అయితే ఒకరికి మాత్రమే సీట్ ఇచ్చి, మరొకరు కొత్తవారికి ఇవ్వాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నారు.

కాంగ్రెస్ లో గల కుమ్ములాటలు ఆసరాగా తీసుకొని, రెండు అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తున్నది. అప్పుడు కాంగ్రెస్ నుండి ఒక్కరు మాత్రమే గెలుపొందగలరు.

కాంగ్రెస్ ఎమ్యెల్యేలు `అపహరణ’కు గురవుతున్నట్లు దిగివిజయ్ సింగ్ చెప్పడమే గాని ముఖ్యమంత్రి నోరు మెదపక పోవడం గమనార్హం. ఇదంతా రాజ్యసభ సీట్ల కోసం జరుగుతున్న నాటకంగా పలువురు భావిస్తున్నారు.