అంబానీ – జగన్ మధ్య అమిత్ షా రాయబారం!

భారత దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత అకస్మాత్తుగా వచ్చి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి వెళ్లడం రాజకీయ వర్గాలలో సంచలనం రేపుతున్నది. ఆయన రాక గురించి ముందుగా చాల గోప్యంగా ఉంచడంతో తెరవెనుక రాజకీయాలు యేవో జరుగుతున్నట్లు అనుమానాలు కలిగిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడుల గురించి చర్చించడం కోసం వచ్చిన్నట్లు ఏపీ ప్రభుత్వ నేతలు చెబుతున్నప్పటికీ, రాజకీయ మంత్రాంగం కోసమే వచ్చిన్నట్లు సర్వత్రా వినిపిస్తున్నది. పైగా, గతంలో […]

Written By: Neelambaram, Updated On : March 2, 2020 11:20 am
Follow us on

భారత దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత అకస్మాత్తుగా వచ్చి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి వెళ్లడం రాజకీయ వర్గాలలో సంచలనం రేపుతున్నది. ఆయన రాక గురించి ముందుగా చాల గోప్యంగా ఉంచడంతో తెరవెనుక రాజకీయాలు యేవో జరుగుతున్నట్లు అనుమానాలు కలిగిస్తున్నది.

ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడుల గురించి చర్చించడం కోసం వచ్చిన్నట్లు ఏపీ ప్రభుత్వ నేతలు చెబుతున్నప్పటికీ, రాజకీయ మంత్రాంగం కోసమే వచ్చిన్నట్లు సర్వత్రా వినిపిస్తున్నది. పైగా, గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి మరణం సహజమైనది కాదని, కుట్ర దాగి ఉన్నదని అంటి ఒక రష్యా వెబ్ సైట్ పేర్కొనడం కలకలం రేపడం తెలిసిందే.

చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసం అంబానీ చేస్తున్న ప్రయత్నాలకు వైఎస్ విముఖంగా ఉండడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదం వెనుక ఆయన హస్తం ఉండివచ్చనే అనుమానాలను ఆ వార్తాకథనం ఆధారంగా అప్పట్లో వైసిపి నేతలే వ్యక్తం చేశారు. ఆ కాశానంపై కేంద్ర ప్రభుత్వం లోతైన దర్యాప్తు జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.

అటువంటిది నేరుగా కుమారుడితో సహా అంబానీ రావడం పలువురికి విస్మయం కలిగిస్తున్నది. జగన్ – అంబానీ ల మధ్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా `సయోధ్య’ కుదిర్చారనే కధనం ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం లోకి వస్తున్నది. ఈ మధ్య ఢిల్లీలో జగన్ కలసినప్పుడు అంబానీ గురించి అమిత్ షా ప్రచవిస్తారని చెబుతున్నారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధ్యక్షుడు పరిమళ్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించేందుకే ముఖేశ్‌ అంబానీ స్వయంగా జగన్ వద్దకు వచ్చిన్నట్లు చెబుతున్నారు. ఈ కథనాలను ఇప్పటి వరకు వైసిపి నేతలు ఎవ్వరు ఖండించక పోవడం గమనార్హం. ముఖేశ్‌ తనతోపాటు నత్వానీని కూడా జగన్‌ వద్దకు తీసుకువచ్చారు.

నత్వానీ 2008 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2014లో జార్ఘండ్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందుకు బిజెపి సహకరించింది. ఏప్రిల్‌ 9వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తోంది. అందుకనే ఏపీ నుండి అతనిని రాజ్యసభకు పంపమని అమిత్ షా జగన్ కు సూచించారని చెబుతున్నారు.

తనపై ఉన్న ఆర్ధిక నేరాల కేసుల నుండి బైట పడటం కోసం జగన్ కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతున్న సంగతి తెలిసింది. అందుకోసం ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో ఏపీ నుండి మొత్తం నాలుగు సీట్లను తాము గెలుచుకోగల శక్తీ ఉన్నప్పటికీ ఒకటి లేదా రెండు సీట్లను బిజెపికి ఇవ్వజూపినట్లు కధనాలు వచ్చాయి.

అయితే నేరుగా జగన్ నుండి సీట్లు తీసుకోవడానికి వెనుకాడిన అమిత్ షా అంబానీ సూచించిన వ్యక్తికి ఇవ్వమని సలహా ఇచ్చారని తెలుస్తున్నది. పైగా, రాజ్యసభలో బిజెపి బలం తగ్గుతున్న దృష్ట్యా రాబోయే రోజులలో వైసిపి మద్దతు సహితం కీలకం కానున్నది.