https://oktelugu.com/

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

ప్రపంచ వ్యాప్తంగా నేతలు, పారిశ్రామికవేత్తలు అక్రమంగా సంపాదించిన డబ్బునంతా స్విట్జార్యాండ్ లోని బ్యాంకుల్లో జమ చేసేవారు. నల్లడబ్బు దాచుకోవడానికి సురక్షితమైన దేశంగా స్విట్జర్లాండ్ ఒకప్పుడు ఉండేది. అక్కడ వివరాలు బయటకు పొక్కేవి కావు. కానీ వికీలీక్స్ సహా కొన్ని సంస్థల ఉద్యమంతో ఈ నల్లడబ్బు దారుల బండారం బయటపడి ఇరుక్కుపోయారు. ఇక నరేంద్రమోడీ దేశ ప్రధాని అయ్యాక దౌత్య ఒత్తిడి ద్వారా నల్లడబ్బు దాచిన వారి వివరాలు సేకరించి రికవరీ చేయించాడు. అంతేకాదు.. 2016లో పెద్దనోట్లను రద్దు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2020 / 08:59 PM IST
    Follow us on


    ప్రపంచ వ్యాప్తంగా నేతలు, పారిశ్రామికవేత్తలు అక్రమంగా సంపాదించిన డబ్బునంతా స్విట్జార్యాండ్ లోని బ్యాంకుల్లో జమ చేసేవారు. నల్లడబ్బు దాచుకోవడానికి సురక్షితమైన దేశంగా స్విట్జర్లాండ్ ఒకప్పుడు ఉండేది. అక్కడ వివరాలు బయటకు పొక్కేవి కావు. కానీ వికీలీక్స్ సహా కొన్ని సంస్థల ఉద్యమంతో ఈ నల్లడబ్బు దారుల బండారం బయటపడి ఇరుక్కుపోయారు. ఇక నరేంద్రమోడీ దేశ ప్రధాని అయ్యాక దౌత్య ఒత్తిడి ద్వారా నల్లడబ్బు దాచిన వారి వివరాలు సేకరించి రికవరీ చేయించాడు. అంతేకాదు.. 2016లో పెద్దనోట్లను రద్దు చేసి నల్లకుబేరుల ఆట కట్టించాడు. నల్లడబ్బును అంతా ఆ సమయంలోనే వైట్ గా నల్లకుబేరులు మార్చేసుకున్నారు. స్థలాలు, ఆస్తులు, రియల్ ఎస్టేట్ రంగాలు ఇతర రంగాల్లో పెట్టుబడులుగా మళ్లించారు.

    సోనియా గాంధీ చేష్టలతో కాంగ్రెస్ పరువు గంగపాలు

    అయితే తాజా రిపోర్టు ఏంటంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి, ప్రభుత్వాల నజర్ పెరిగిపోవడంతో భారతీయుల నల్లడబ్బు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో తరిగిపోతోంది. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండంతో ఆ సొమ్మును చాలా మంది తగ్గించుకున్నారు.

    తాజాగా స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లోని భారతీయులు మరియు సంస్థల నిధులు 6శాతం తగ్గాయి. ఇది రూ.6625 కోట్లకు పరిమితమయ్యాయి. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల స్థూల నిధులు వరుసగా రెండో సంవత్సరం కూడా పడిపోయాయి. నిధుల క్షీణత ఏకంగా 6శాతానికి పరిమితమై మూడో అతి తక్కువ వ్యయంగా నిలిచింది.

    చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

    స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాదారుల డబ్బు 55 మిలియన్లకు పడిపోయింది. ఇది మొత్తం దాచుకున్న బ్యాంకుల్లోని మొత్తంలో కేవలం 5.8శాతం భారతీయులది కావడం గమనార్హం. 2006లో భారతీయుల నల్లడబ్బు ఏకంగా 6.46 బిలియన్లు ఉండేది. అత్యధిక నల్లడబ్బు దాచుకున్న దేశంగా ఇండియా టాప్ లో ఉండేది. 2014 సంవత్సరానికి వచ్చేసరికి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడంతో 1.81 బిలియన్లకు నల్లడబ్బు తగ్గింది. అంటే 14400కోట్లకు నల్లడబ్బు పరిమితమైంది.

    నల్లధనాన్ని అరికట్టడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయులకు శరాఘాతంగా మారాయి. అందుకే ఈ నల్లడబ్బు నిధులు భారతీయులవి భారీగా తగ్గాయి.

    ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో ఖాతాదారుల పరంగా భారత్ పోయిన సంవత్సరం 74వ స్థానంలో ఉండేది. ఇప్పుడు మోడీ దెబ్బకు నల్లడబ్బు కరిగిపోయి భారత్ మూడు స్థానాలు పడిపోయి 77వ స్థానంలో నిలిచింది. అందరికంటే ఖాతాదారుల పరంగా బ్రిటన్ దేశం అగ్రస్థానంలో నిలిచింది. వారి ఖాతాదారులు, డిపాజిట్లు భారీగా స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి.

    -నరేశ్ ఎన్నం